Ind vs eng : రోహిత్ సెంచరీ.. గంగూలీ రికార్డు బద్దలు..

రాజ్ కోట్ (Rajkot) వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న మూడో టెస్టులో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ముందుండి నడిపిస్తున్నారు. జడేజాతో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పిన హిట్ మ్యాన్ 157 బంతుల్లోనే శతకం (101*) బాదారు. టెస్టుల్లో రోహిత్ కు ఇది 11వ సెంచరీకాగా ఇండియాలో 6వది. రాజ్ కోట్ లో సెంచరీ బాదిన 4వ ఓపెనర్ గా రోహిత్ నిలిచారు. ఇదివరకు పృథ్వీ షా, కుక్, మురళీ విజయ్ లు సెంచరీ చేశారు.
ఈ సెంచరీతో రోహిత్ శర్మ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్లలో రోహిత్.. గంగూలీని అధిగమించాడు. 16 ఏండ్ల కెరీర్‌లో గంగూలీ.. 421 మ్యాచ్‌లలో 18,575 పరుగులు చేయగా తాజాగా హిట్‌మ్యాన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. రాజ్‌కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా రెండో సెషన్‌లో 65 పరుగులు పూర్తి చేయగానే అతడు దాదా రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
దీంతో పాటుగా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోని పేరిట ఉన్న మరో రికార్డును కూడా రోహిత్ బ్రేక్ చేశాడు. అదేంటంటే. రాజ్‌కోట్ టెస్టులో రోహిత్ రెండు సిక్సర్లు బాదడంతో భారత్ తరఫున టెస్టులలో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. టెస్టులలో ధోని ఖాతాలో 78 సిక్సర్లుండగా రోహిత్ 80 సిక్సర్లు కొట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com