ROHIT: రిటైర్‌మెంట్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు పలుకుతాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై రోహిత్ స్పందించారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. తనకు భవిష్యత్తు గురించి ఇప్పుడే ఎలాంటి ప్లాన్‌లు లేవని పేర్కొన్నాడు. తన రిటైర్‌మెంట్ గురించి ఎలాంటి ప్రచారం చేయొద్దని, వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తాను రిటైర్ కావట్లేదని స్పష్టత ఇచ్చాడు. సుదీర్ఘమైన క్రికెట్ ఆడిన వారికి ఇంకా ఆడాలని ఉంటుందన్నాడు.
నాకు జట్టు అండగా నిలిచింది: రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం చాలా ఆనందంగా ఉందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడాడు. ‘టోర్నీ ఆసాంతం చాలా బాగా ఆడాం. ఇలాంటి ప్రదర్శనతో విజేతగా నిలవడం గొప్పగా ఉంది. మనం వైవిద్యంగా ఆడాలనుకుంటున్నప్పుడు జట్టు మద్దతు అవసరం. నాకు జట్టు అండగా నిలిచింది. ఇదే విషయంపై 2023 ప్రపంచకప్ సమయంలో రాహుల్ ద్రవిడ్‌తో, ఇప్పుడు గౌతమ్ భాయ్‌తో మాట్లాడాను. ఇలానే ఉండాలని నేను కోరుకున్నాను’ అని రోహిత్ అన్నాడు.
రోహిత్ శర్మకు సెల్యూట్: కాంగ్రెస్ నేత
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియాను కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ అభినందించారు. 76 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించిన కెప్టెన్ రోహిత్ శర్మకు సెల్యూట్ చేశారు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారని ప్రశంసలతో ముంచెత్తారు. కాగా, ఇటీవలే షామా, రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన సంగతి తెలిసిందే.
ఎంతో ఆనందంగా ఉంది: కోహ్లీ
ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం చాలా ఆనందంగా ఉందని రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ఇది అద్భుత విజయం. విజేతగా నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. కఠినమైన ఆస్ట్రేలియా పర్యటన తర్వాత మళ్లీ పుంజుకోవాలని నిర్ణయించుకున్నాం. ఏదైనా పెద్ద టోర్నీ గెలవాలనుకున్నాం. ఈ సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం నిజంగా అద్భుతం. ఈ టోర్నీలో జట్టు సభ్యులందరూ అద్భుత ప్రదర్శన చేశారు’ అని అన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com