SA WIN: టీమిండియాను చిత్తు చేసిన సఫారీలు

SA WIN: టీమిండియాను చిత్తు చేసిన సఫారీలు
X
రెండో టీ20లో సౌతాఫ్రికా గెలుపు... అన్ని విభాగాల్లో భారత్ విఫలం... 213 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా.. 162 రన్స్‌కే కుప్పకూలిన ఇండియా

న్యూ­చం­డీ­గ­ఢ్‌ లోని ము­ల్లా­న్‌­పూ­ర్ వే­ది­క­గా భా­ర­త్, దక్షి­ణా­ఫ్రి­కా మధ్య జరి­గిన రెం­డో టీ20 మ్యా­చ్‌­లో టీ­మిం­డి­యా­కు భారీ పరా­జ­యం మూ­ట­గ­ట్టు­కుం­ది. దక్షి­ణా­ఫ్రి­కా ని­ర్దే­శిం­చిన 214 పరు­గుల భారీ లక్ష్యా­న్ని ఛే­దిం­చ­డం­లో భారత బ్యా­ట­ర్లు వి­ఫ­ల­మ­య్యా­రు. దీం­తో దక్షి­ణా­ఫ్రి­కా జట్టు 51 పరు­గుల తే­డా­తో ఘన వి­జ­యం సా­ధిం­చిం­ది. 214 పరు­గుల లక్ష్యం­తో బరి­లో­కి ది­గిన భా­ర­త్ 19.1 ఓవ­ర్ల­లో 162 పరు­గు­ల­కు ఆలౌ­ట్ అయ్యిం­ది.

డికాక్ ఆటే హైలెట్

తొలి టీ 20 మ్యా­చ్‌­లో వి­ఫ­ల­మైన దక్షి­ణా­ఫ్రి­కా ఓపె­న­ర్‌ డి­కా­క్‌.. ఈసా­రి చె­ల­రే­గి­పో­యా­డు. వి­ధ్వం­సక బ్యా­టిం­గ్‌­తో జట్టు భారీ స్కో­రు సా­ధిం­చ­డం­లో కీలక పా­త్ర పో­షిం­చా­డు. దక్షి­ణా­ఫ్రి­కా టా­స్‌ ఓడి బ్యా­టిం­గ్‌­కు ది­గ­గా.. హెం­డ్రి­క్స్‌ (8)తో కలి­సి డి­కా­క్‌ పరు­గుల వే­ట­ను ఆరం­భిం­చా­డు. అల­వో­క­గా షా­ట్లు ఆడిన అతడు.. మొ­త్తం ఏడు సి­క్స్‌­లు బా­దే­శా­డు. అం­దు­లో ఎక్కు­వ­గా డీ­ప్‌ స్క్వే­ర్‌ లె­గ్‌ ప్రాం­తం­లో­కి కొ­ట్టా­డు. తొలి ఓవ­ర్లో అర్ష్‌­దీ­ప్‌ బౌ­లిం­గ్‌­లో సి­క్స్‌­తో మొ­ద­లైం­ది డి­కా­క్‌ జోరు. ఆ తర్వాత ఏ దశ­లో­నూ తగ్గ­కుం­డా భారత బౌ­ల­ర్లం­ద­రి­నీ సు­నా­యా­సం­గా ఎదు­ర్కొ­న్నా­డు. ఐపీ­ఎ­ల్‌ వే­లా­ని­కి కొ­న్ని రో­జుల ముం­దు ఈ ఇన్నిం­గ్స్‌.. డి­కా­క్‌­పై ఫ్రాం­ఛై­జీ­ల్లో ఆస­క్తి­ని పెం­చు­తుం­ద­న­డం­లో సం­దే­హం లేదు. డి­కా­క్‌ జో­రు­తో పవ­ర్‌ ప్లే ము­గి­సే­స­రి­కి 53/1తో ని­లి­చిం­ది దక్షి­ణా­ఫ్రి­కా. డి­కా­క్‌ (90; 46 బం­తు­ల్లో 5×4, 7×6) వి­రు­చు­కు­ప­డ్డా­డు. డొ­నో­వ­న్‌ ఫె­రీ­రా (30 నా­టౌ­ట్‌; 16 బం­తు­ల్లో 1×4, 3×6), మి­ల్ల­ర్‌ (20 నా­టౌ­ట్‌; 12 బం­తు­ల్లో 2×4, 1×6) వి­రు­చు­కు­ప­డ­డం­తో ఆఖరి 3 ఓవ­ర్ల­లో దక్షి­ణా­ఫ్రి­కా 49 పరు­గు­లు రా­బ­ట్టిం­ది.

తిలక్ వర్మ ఒక్కడే...

214 పరు­గుల లక్ష్య ఛే­ద­న­లో టీ­మ్‌­ఇం­డి­యా చే­తు­లె­త్తే­సిం­ది. 32 పరు­గు­ల­కే 3 వి­కె­ట్లు కో­ల్పో­యి చి­క్కు­ల్లో పడిం­ది. టీ20ల్లో తన బ్యా­టిం­గ్‌ చర్చ­నీ­యాం­శ­గా మా­రిన నే­ప­థ్యం­లో గి­ల్‌ వై­ఫ­ల్యం కొ­న­సా­గిం­ది. అతడు ఖాతా అయి­నా తె­ర­వ­కుం­డా­నే తొలి ఓవ­ర్లో ఎం­గి­డి బౌ­లిం­గ్‌­లో వె­ను­ది­రి­గా­డు. సూ­ర్య కూడా అంతే. పేలవ ఫా­మ్‌­ను కొ­న­సా­గి­స్తూ నా­లు­గో ఓవ­ర్లో యా­న్సె­న్‌­కు దొ­రి­కి­పో­యా­డు. యా­న్సె­న్‌ తన అం­త­కు­ముం­దు ఓవ­ర్లో అభి­షే­క్‌ (17)ను వె­న­క్కి పం­పా­డు. భా­ర­త్‌ చక­చ­కా మూడు వి­కె­ట్లు కో­ల్పో­యిన స్థి­తి­లో తి­ల­క్‌ ని­ల­బ­డ్డా­డు. బ్యా­టిం­గ్‌ ఆర్డ­ర్‌­లో ముం­దొ­చ్చిన అక్ష­ర్‌ పటే­ల్‌ (21; 21 బం­తు­ల్లో 1×4, 1×6)తో కలి­సి ఇన్నిం­గ్స్‌­ను నడి­పిం­చా­డు. కా­సే­పు వి­కె­ట్ల పతనం ఆగి­నా.. అక్ష­ర్‌ ప్ర­మో­ష­న్‌ సత్ఫ­లి­తా­న్ని­వ్వ­లే­దు. అక్ష­ర్‌ ధా­టి­గా ఆడ­లే­క­పో­యా­డు. తి­ల­క్‌ వర్మ (62; 34 బం­తు­ల్లో 2×4, 5×6) గట్టి­గా­నే పో­రా­డి­నా.. అది సరి­పో­లే­దు. బా­ర్ట్‌­మ­న్‌ (4/24), యా­న్సె­న్‌ (2/25), ఎం­గి­డి (2/26) భా­ర­త్‌­ను దె­బ్బ­తీ­శా­రు. మూడో టీ20 ఆది­వా­రం ధర్మ­శా­ల­లో జరు­గు­తుం­ది.

హర్ష్‌దీప్ చెత్త రికార్డు

పే­స­ర్ అర్ష్‌­దీ­ప్ సిం­గ్ తన పేలవ ప్ర­ద­ర్శ­న­తో అన­వ­స­ర­మైన రి­కా­ర్డు­ను మూ­ట­గ­ట్టు­కు­న్నా­డు. దక్షి­ణా­ఫ్రి­కా ఇన్నిం­గ్స్ 11వ ఓవ­ర్‌­లో బౌ­లిం­గ్ చే­య­డా­ని­కి వచ్చిన అర్ష్‌­దీ­ప్.. పూ­ర్తి­గా లయ తప్పి చె­త్త రి­కా­ర్డు­ను నమో­దు చే­శా­డు. ఆ ఒక్క ఓవ­ర్‌­లో­నే అర్ష్‌­దీ­ప్ ఏకం­గా ఏడు (7) వైడ్ బా­ల్స్‌ వే­శా­డు. ఈ వై­డ్‌ల కా­ర­ణం­గా 6 బం­తుల ఓవర్ కా­స్తా.. ఏకం­గా 13 బం­తుల మ్యా­ర­థా­న్ ఓవ­ర్‌­గా మా­రిం­ది. మొ­త్తం­గా ఆ ఓవ­ర్‌­లో అర్ష్‌­దీ­ప్ మొ­త్తం 18 పరు­గు­లు సమ­ర్పిం­చు­కు­న్నా­డు.

Tags

Next Story