Sachin Tendulkar : అల్లుడు ఆరడుగుల అందగాడనుకున్నా: సచిన్ అత్త

Sachin Tendulkar : అల్లుడు ఆరడుగుల అందగాడనుకున్నా: సచిన్ అత్త
X

సచిన్ టెండూల్కర్ గురించి ఆయన అత్త అనాబెల్ మెహతా ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ‘అంజలి ఓ కుర్రాడితో ప్రేమలో ఉందని తెలుసుకుని అతడిని చూడాలనుకున్నా. ఆరడుగులు ఉంటాడని, అందంగా ఉంటాడని ఊహించుకున్నా. తీరా చూస్తే పొట్టిగా ఉన్నాడు. చిన్నపిల్లాడిలా కనిపించాడు. అంజలి హీల్స్ వేసుకుంటే ఆమె ఎత్తు కూడా ఉండడు. నిశ్చితార్థం అయ్యాక దొంగచాటుగా మా ఇంటికి వచ్చేవాడు’ అని ఆమె ‘మై పాసేజ్ టు ఇండియా’ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే, ఆ స‌మ‌యంలో అత‌ను చెప్పిన స‌మాధానం న‌న్ను ఆశ్చ‌ర్య ప‌రిచింది. 'మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం' అని సూటిగా చెప్పాడు. త‌న కూతురిని పెళ్లి చేసుకోవ‌డానికి 1995 వ‌ర‌కు (అత‌నికి 22 ఏళ్లు వ‌చ్చేవ‌ర‌కు) వేచి చూశాడు" అని అన్నాబెల్లే త‌న పుస్తకంలో రాసుకొచ్చారు. అంజలి కుటుంబం 1950 ప్రాంతంలో ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చి స్థిరపడింది. "భారత క్రికెట్‌లో సచిన్ అత్యంత ప్రభావవంత‌మైన‌ స్టార్ క్రికెట‌ర్‌ అని నేను అప్పటికి గుర్తించాను. కానీ అతను తన తోటి క్రికెటర్లలో చాలా మందిలానే ప్లేబాయ్‌గా మారే అవకాశం ఉందని ఆందోళన చెందాను. తొంభైలలో సచిన్ ఇంగ్లాండ్‌లో డేవిడ్ బెక్‌హామ్ లాగా ఉండేవాడు.

Tags

Next Story