Cricket : సంచలనం వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు

Cricket : సంచలనం వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు
X

అర్జెంటీనా బౌలర్ హెర్నాన్ ఫెన్నెల్ పురుషుల టీ20లో అరుదైన రికార్డు నెలకొల్పారు. టీ20 వరల్డ్ కప్ సబ్ రీజనల్ అమెరికా క్వాలిఫయర్స్‌లో కేమన్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచులో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీశారు. మొత్తంగా 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన ఆరో ప్లేయర్‌గా నిలిచారు. క్రీజులోకి వచ్చిన బ్యాటర్‌ను వచ్చినట్లు పెవిలియన్‌కు పంపించాడు హెర్నర్ ఫెన్నెల్. మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో అతడు ఈ ఫీట్ నమోదు చేశాడు. ట్రాయ్ టేలర్, అలిస్టర్ ఇఫిల్, రొనాల్డ్ ఎబాంక్స్, అలెగ్జాండ్రో మోరిస్‌ను అతడు ఔట్ చేశాడు. మొత్తంగా అతడి స్పెల్ ముగిసేసరికి 14 పరుగులు ఇచ్చుకొని 5 వికెట్లు పడగొట్టాడు ఫెన్నెల్. జెంటిల్మన్ గేమ్‌లో వరుస బంతుల్లో 4 వికెట్లు తీస్తే డబుల్ హ్యాట్రిక్‌గా పరిగణిస్తారు. అలా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాను చూసుకుంటే.. రషీద్ ఖాన్ టాప్‌లో ఉన్నాడు. లసిత్ మలింగ, కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాతి ప్లేస్‌లో లెసోతోకు చెందిన వసీం యకూబ్ ఉండగా.. తాజా స్పెల్‌తో హెర్నర్ ఫెన్నెల్ ఐదో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

Tags

Next Story