Shikhar Dhawan : ఇంటర్నేషనల్ క్రికెట్ కు శిఖర్ ధావన్ రిటైర్ మెంట్

టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్.. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంటర్నేషనల్ తో పాటు డొమెస్టిక్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లు దేశం తరుపున ఆడినందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. సపోర్ట్‌గా నిలిచిన ప్రేక్షకులకు, టీమిండియా క్రికెట్ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.
ధవన్ టీమిండియా తరపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచులు ఆడారు. మొన్నటి ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న శిఖర్ ధావన్ ఈ సీజన్‌లో రెండు మ్యాచులు మాత్రమే ఆడాడు. భుజం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సామ్ కరన్‌కు మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. శిఖర్ గాయం నుంచి కోలుకున్నా మేనేజ్‌మెంట్ అతడిని పక్కన బెట్టింది.
టీమిండియాకు ఓపెనర్‌గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు శిఖర్ ధావన్. వన్డేల్లో 17 సెంచరీలతో 6793 పరుగులు సాధించాడు. టెస్టుల్లో ఏడు సెంచరీలతో 2315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1759 పరుగులు సాధించాడు. అయితే, ధావన్ ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com