Shoaib Malik : మూడో భార్యతో హనీమూన్‌కు వెళ్లిన షోయబ్ మాలిక్

భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు (Sania Mirza) విడాకులు ఇచ్చిన పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) ఇటీవల లాలీవుడ్ నటి సనా జావేద్‌ను మూడవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట జనవరి 19న, 2024న నికాహ్ వేడుకలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట హనీమూన్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది.
గురువారం సనా జావేద్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఫోటోలు రిలీజ్ చేసింది. ఇందులో స్విమ్మింగ్ పూల్ పక్కన పసుపు తెలుపు రంగులు చారలు కలిగిన తువ్వాలతో వారి పాదాలు కప్పబడి ఉంది. ఫోటోను బట్టి వారిద్దరు విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. లోకేషన్ ఎక్కడ అని తెలియనప్పటికీ ఈ జంట హనీమూన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితు దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు .
ఇక షోయబ్ మాలిక్ .. సానియా మీర్జాను 2010లో వివాహం చేసుకున్నారు. సానియాకు ఇది మొదటి వివాహం కాగా షోయబ్‌కు ఇది రెండో పెళ్లి. అంతకుముందు మొదటి భార్య అయేషా సిద్ధిఖిని వివాహం చేసుకున్న షోయబ్.. ఆమెకు విడాకులు ఇచ్చి సానియా మీర్జాను పెళ్లాడాడు. వీరికి 2018లో ఇజాన్ అనేకుమారుడు జన్మించాడు.
ఇక సనా జావేద్ విషయానికి వస్తే.. 1993 మార్చి 25న సౌదీ అరేబియాలోని జెద్దాలో పాకిస్తానీ తల్లిదండ్రులకు జన్మించింది. ఆమె పూర్వీకులు హైదరాబాద్ దక్కన్‌కు చెందినవారు. అక్టోబరు 2020లో ఆమె గాయకుడు ఉమైర్ జస్వాల్‌ని వివాహం చేసుకుంది. ఉమైర్ జస్వాల్ 2023 నవంబరు 28న సనా జావేద్‌కి విడాకులు ఇచ్చాడు. 2024 జనవరి 19న షోయబ్ మాలిక్‌ని ఆమె రెండవ వివాహం చేసుకుంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com