26 Nov 2021 5:00 AM GMT

Home
 / 
క్రీడలు / Kanpur Test 2nd day :...

Kanpur Test 2nd day : శ్రేయస్‌ అయ్యర్‌.. అరంగేట్రంలోనే శతకం..!

IND vs NZ : కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆటలో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (100) శతకం బాదాడు.

Kanpur Test 2nd day : శ్రేయస్‌ అయ్యర్‌.. అరంగేట్రంలోనే  శతకం..!
X

IND vs NZ : కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆటలో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (100) శతకం బాదాడు. ఇందులో రెండు సిక్సర్లు, 12 ఫోర్లున్నాయి. అరంగేట్రం టెస్టులోనే సెంచరీ కొట్టి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. అరంగేట్రంలోనే టెస్ట్ సెంచరీ చేసిన 16వ ఇండియన్ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. అదే విధంగా డెబ్యూ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. కాగా ప్రస్తుతం క్రీజ్‌‌లో శ్రేయాస్ (104), అశ్విన్ (4) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి 292పరుగులుగా ఉంది.

Next Story