SIRAJ: సిరాజ్ మియా.. కమాల్ కియా

SIRAJ: సిరాజ్ మియా.. కమాల్ కియా
X
ఆఖరి టెస్టులో భారత్‌ను గెలిపించిన సిరాజ్... సిరాజ్ మ్యాజిక్‌తో 6 పరుగుల తేడాతో భారత్ గెలుపు.. 23 వికెట్లతో ఈ సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్‌గా మియా

మియా భాయ్ మహ­మ్మ­ద్ సి­రా­జ్ సత్తా చా­టా­డు. చి­వ­రి టె­స్టు­లో అద్భు­త­మే చే­శా­డు. ఓవల్ వే­ది­క­గా జరి­గిన ఉత్కం­ఠ­భ­రిత మ్యా­చు­లో భా­ర­త్ ను గె­లి­పిం­చా­డు. బు­మ్రా లే­క­పో­తే తాను ఎంత ప్ర­మా­ద­కర బౌ­ల­ర్నో మరో­సా­రి క్రి­కె­ట్ ప్ర­పం­చా­ని­కి చా­టి­చె­ప్పా­డు. ఆల్‌­మో­స్ట్ చేయి దా­టి­పో­యిన మ్యా­చ్‌­ని గె­లి­పిం­చి టీ­మిం­డి­యా చరి­త్ర­లో అతి గొ­ప్ప వి­జ­యా­న్ని అం­దిం­చా­డు. నరా­లు తెగే ఉత్కం­ఠ­భ­రి­తం­గా సా­గిన ఓవల్ టె­స్టు ఆఖరి రోజు మియా భాయ్ హీరో ఆఫ్ ది మ్యా­చ్‌­గా ని­లి­చా­డు. సి­రా­జ్ స్విం­గ్‌­కి ఇం­గ్లం­డ్ బ్యా­ట­ర్ల­తో ప్రే­క్ష­కు­లు సైతం నో­రె­ళ్ల­బె­ట్టా­రం­టే అతి­శ­యో­క్తి కాదు. ఇద్ద­రు ఇం­గ్లం­డ్ బ్యా­ట­ర్లు సెం­చ­రీ చే­సి­న­ప్ప­టి­కీ భా­ర­త్‌­ను గె­లి­పిం­చిన సి­రా­జ్‌­కు క్రి­కె­ట్ లోకం సె­ల్యూ­ట్ చే­స్తోం­ది. ఈ సి­రీ­స్‌­లో 23 వి­కె­ట్లు తీసి టాప్ బౌ­ల­ర్‌­గా ని­లి­చా­డు. . టె­స్ట్ క్రి­కె­ట్ చరి­త్ర­లో వి­దే­శీ గడ్డ­పై జరి­గిన ఐదు టె­స్ట్‌ల సి­రీ­స్‌­లో చి­వ­రి మ్యా­చ్‌­ను భా­ర­త్ గె­ల­వ­డం ఇదే తొ­లి­సా­రి. గతం­లో భా­ర­త్ వి­దే­శీ గడ్డ­పై 16 ఐదు టె­స్ట్‌ల సి­రీ­స్‌­ల­ను ఆడిం­ది. వా­టి­లో చి­వ­రి టె­స్ట్‌­లో 6 సా­ర్లు ఓడి­పో­యిం­ది. చి­వ­రి టె­స్ట్ మ్యా­చ్ 10 సా­ర్లు డ్రా­గా ము­గి­సిం­ది. ఇప్పు­డు చి­వ­ర­కు భారత జట్టు వి­దే­శా­ల్లో జరి­గిన ఐదు టె­స్ట్‌ల సి­రీ­స్‌­లో చి­వ­రి మ్యా­చ్‌­ను గె­లు­చు­కో­వ­డం­లో వి­జ­యం సా­ధిం­చిం­ది. భా­ర­త్ ఈ వి­జ­యం సా­ధిం­చ­డా­ని­కి కా­ర­ణం ము­మ్మా­టి­కి సి­రా­జే. ఆఖరి రోజు ఆటలో జెమీ ఓవ­ర్ట­న్ దూ­కు­డు­గా రెం­డు బౌం­డ­రీ­ల­తో ఇన్నిం­గ్స్‌­ను ప్రా­రం­భిం­చా­డు. కానీ, సి­రా­జ్ మ్యా­జి­క్ వెం­ట­నే మొ­ద­లైం­ది. జెమీ స్మి­త్‌­ను (2) క్యా­చ్ ఔట్‌­గా పె­వి­లి­య­న్ చే­ర్చి భారత శి­బి­రం­లో ఆశలు రే­కె­త్తిం­చా­డు. తన మరు­స­టి ఓవ­ర్‌­లో­నే దూ­కు­డు­గా ఆడు­తు­న్న జెమీ ఓవ­ర్ట­న్‌­ను (9) వి­కె­ట్ల ముం­దు బో­ల్తా కొ­ట్టిం­చి ఇం­గ్లం­డ్‌­కు షా­కి­చ్చా­డు. ఇక ప్ర­సి­ధ్ కృ­ష్ణ కూడా తన­వం­తు పా­త్ర పో­షిం­చా­డు. జోష్ టం­గ్‌­ను (0) ఒక స్ట­న్నిం­గ్ యా­ర్క­ర్‌­తో క్లీ­న్ బౌ­ల్డ్ చేసి మ్యా­చ్‌­ను మరింత ఉత్కం­ఠ­గా మా­ర్చా­డు. ఈ వి­కె­ట్ తర్వాత క్రి­స్ వో­క్స్ ఒంటి చే­త్తో బ్యా­టిం­గ్ చే­సేం­దు­కు సా­హ­సం చేసి, అట్కి­న్స­న్ సహా­యం­తో జట్టు వి­జ­యం కోసం పో­రా­డా­డు. ప్ర­సి­ధ్ కృ­ష్ణ బౌ­లిం­గ్‌­లో అట్కి­న్స­న్ మూడు పరు­గు­లు చేసి మళ్ళీ స్ట్రై­క్ తీ­సు­కు­న్నా­డు. కానీ, సి­రా­జ్ ఈసా­రి ఎలాం­టి పొ­ర­పా­టు­కు తా­వి­వ్వ­కుం­డా అట్కి­న్స­న్‌­ను క్లీ­న్ బౌ­ల్డ్ చేసి, భారత వి­జ­యా­న్ని లాం­ఛ­నం చే­శా­డు.

ఆయన వల్లే విజయం: సిరాజ్

దే­వు­డి దయ వల్లే ఇం­గ్లం­డ్‌­తో ఆఖరి టె­స్ట్‌­లో చి­ర­స్మ­ర­ణీయ వి­జ­యా­న్నం­దు­కు­న్నా­మ­ని టీ­మిం­డి­యా స్టా­ర్ పే­స­ర్ మహ­మ్మ­ద్ సి­రా­జ్ అన్నా­డు. బ్రూ­క్ క్యా­చ్ వది­లే­సిన తర్వాత తాము మ్యా­చ్‌­లో వె­ను­క­బ­డి­పో­యా­మ­ని, కానీ తాను మా­త్రం గె­లు­పు­పై ఆశలు వదు­లు­కో­లే­ద­ని సి­రా­జ్ స్ప­ష్టం చే­శా­డు. ఆఖరి రోజు ఆట ప్రా­రం­భా­ని­కి ముం­దు క్రి­కె­ట­ర్‌­గా ఎది­గేం­దు­కు తాను పడిన కష్టా­న్ని గు­ర్తు చే­సు­కో­వా­ల­ని రవీం­ద్ర జడే­జా సూ­చిం­చా­డ­ని, ఆ మా­ట­లు తనను మో­టి­వే­ట్ చే­సా­య­ని తె­లి­పా­డు. ఈ మ్యా­చ్ గె­లు­పు­పై తాను ఆశలు కో­ల్పో­లే­ద­ని చె­ప్పా­డు. 'ఏది ఏమై­నా సరైన ప్ర­దే­శం­లో బౌ­లిం­గ్ చే­యా­ల­నే ప్లా­న్‌­తో బరి­లో­కి ది­గా­ను. వి­కె­ట్లు పడి­నా.. పరు­గు­లు వచ్చి­నా నేను పట్టిం­చు­కో­లే­దు. బ్రూ­క్ క్యా­చ్ తీ­సు­కు­న్న­ప్పు­డు బౌం­డ­రీ లై­న్‌­ను తా­కు­తా­న­ని నేను ఊహిం­చ­లే­దు. అది మ్యా­చ్‌­ను మలు­పు తి­ప్పే క్ష­ణం. ఆ అవ­కా­శం­తో బ్రూ­క్ టీ20 మూ­డ్‌­లో­కి వె­ళ్లి­పో­యా­డు. దాం­తో మేం ఆటలో వె­ను­కం­జ­లో ని­లి­చాం. కానీ ఆ దే­వు­డి దయ వల్ల నేను ఏ పా­యిం­ట్‌­లో­నూ వి­జ­యం­పై వి­శ్వా­సం కో­ల్పో­లే­దు. ఈ ఊదయం కూడా అదే నమ్మ­కం­తో బౌ­లిం­గ్ చే­శా­ను.'అని సి­రా­జ్ చె­ప్పు­కొ­చ్చా­డు.

Tags

Next Story