Gautam Gambhir : ఆరుగురి పేర్లు సూచించిన గంభీర్.. ఒక్కరికి బీసీసీఐ ఆఫర్

టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన మార్క్ చూపిస్తున్నారు. ఇటీవల మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు అతడి సహాయక సిబ్బంది పదవీ కాలం టీ20 ప్రపంచ కప్ తో ముగియడంతో గంభీర్ శకం మొదలైంది. దీంతో గంభీర్ ఇప్పుడు కొత్త కోచింగ్ స్టాఫ్ కోసం అన్వేషిస్తున్నాడు.
తన కోచింగ్ స్టాఫ్ కోసం బృందంలోకి ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే దానిపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నాడు. ఆర్. వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చాట్, జాంటీ రోడ్స్, లక్ష్మీ పతి బాలాజీ పేర్లను గంభీర్ బీసీసీఐకి సూచించాడు. అయితే, ఈ ఆరుగురిలో ఒకరి విషయంలో మాత్రమే బోర్డు ఏకీభవించినట్లు తెలుస్తోంది.
బౌలింగ్ కోచ్ గా మోర్కెల్, వినయ్ కుమార్, బాలాజీ.. ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోట్స్, టెన్ డోస్చాటన్ ను తీసుకోవడానికి బీసీసీఐ ఆసక్తి చూపడం లేదు. అభిషేక్ నాయర్ విషయంలో మాత్రం గంభీర్ ప్రతిపాదనకు బీసీసీఐ ఒకే చెప్పినట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com