Smriti Mandhana : లవ్ సాంగ్సే ఇష్టం : స్మృతి మంధాన ఆసక్తికర విషయాలు

బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్ సహా టీమిండియా ప్లేయర్లు హాజరయ్యారు. ఈసందర్భంగా భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్లే లిస్ట్ క్రియేట్ చేసే వ్యక్తు ల్లో చివరి వ్యక్తిని నేనే. నా దగ్గర ఎక్కువగా లవ్ సాంగ్స్, ట్రాజెడీ పాటలే ఉంటాయి. ఎందుకో తెలియదు అలాంటివే ఇంట్రెస్ట్. మ్యాచ్ కు ముందు అందరూ ఎక్కువగా ఇష్టపడే పంజాబీ మ్యూజిక్ కంటే ఇలాంటివే వింటా. అందుకే డ్రెస్సింగ్ రూమ్లో స్పీకర్ దగ్గరకు వెళ్లి ఏ పాటను మార్చేందుకు ప్రయత్నించను. ఎందుకంటే నేను వినే సాంగ్స్ అక్కడ ప్లే చేస్తే అందరూ 'ఇదేమిటి’ అన్నట్లు నన్ను విచిత్రంగా చూస్తారు. అందుకే నేను మ్యాచు ముందు నా హెడ్ ఫోన్ లోనే పాటలు వింటా. మరీ ముఖ్యంగా అర్జిత్ సింగ్ పాటలంటే మరింత ఇష్టం' అని స్మృతి పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com