Sourav Ganguly : పాక్ జట్టులో టాలెంటెడ్ అటగాళ్లు లేరు :సౌరవ్ గంగూలీ
ఇటీవల సొంత గడ్డపై బంగ్లాదేశ్ చేతిలో చావు దెబ్బ తిన్న పాకిస్థాన్ జట్టుపై అభిమానులు, ఆ దేశ మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. జట్టు సభ్యులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ స్థాయిలో పాక్ క్రికెట్ పతనం కావడంపై తాజాగా భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లో టాలెంట్ కొరత తీవ్రంగా ఉందని, ప్రస్తుతం పాక్ క్రికెట్ పతనానికి అదే కారణమని దాదా చెప్పారు. ‘పాక్‌లో ప్రతిభ కొరవడింది. పాకిస్తాన్ అంటే మనకు మిదాంద్, వసీం అక్రమ్, సయీద్ అన్వర్, మహమ్మద్ యూసుఫ్, యునీస్ ఖాన్ లాంటి వాళ్లే గుర్తొస్తారు. ఒకప్పుడు పాక్ జట్టులో గొప్ప ప్లేయర్లు ఉండేవారు. ప్రస్తుత జట్టులో అలాంటి వాళ్లు లేరు. నేను ఇది అగౌరవపర్చడానికి చెప్పడం లేదు. ప్రతి తరంలోనూ టాలెంటెండ్ ఆటగాళ్లను తయారు చేయాలి. పాక్‌లోని క్రికెట్ సంబంధించిన వారు దీని గురించి ఆలోచించాలి.’ అని గంగూలి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com