Sourav Ganguly : బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ

బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జరిగిన అసోసియేషన్ 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో భారత మాజీ కెప్టెన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, 2015 నుండి 2019 వరకు ఆయన ఆరు సంవత్సరాల ఈ పదవిలో కొనసాగారు . 53 ఏళ్ల ఆయన తన అన్నయ్య స్నేహాశిష్ గంగూలీ స్థానంలో నియమితులయ్యారు, గరిష్టంగా ఆరు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసిన తర్వాత ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. 2019, 2022 మధ్య బిసిసిఐ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన గంగూలీ, ఇప్పుడు కొన్ని ప్రతిష్టాత్మక ప్రణాళికలతో తిరిగి వచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గంగూలీ కొన్ని కీలకమైన ప్రణాళికలను ప్రకటించారు. ప్రస్తుతం 68,000 ఉన్న ఈడెన్ గార్డెన్స్ స్టేడియం సామర్థ్యాన్ని లక్షకు పెంచాలని గంగూలీ యోచిస్తున్నారు. ఈ పని వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ తర్వాత ప్రారంభమవుతుందని తెలిపారు. 2026లో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌లో కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లను ఈడెన్ గార్డెన్స్‌కు రప్పించడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. నవంబర్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వడానికి ఈడెన్ గార్డెన్స్‌ను సిద్ధం చేయడంపై దృష్టి పెడతానని తెలిపారు. బెంగాల్ క్రికెట్ అభివృద్ధి కోసం 9 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక అకాడమీని నిర్మిస్తామని ప్రకటించారు. తన సుదీర్ఘ అనుభవం బెంగాల్ క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com