SPIN PITCH: "స్పిన్" రూట్ మార్చిన టీమిండియా

SPIN PITCH: స్పిన్ రూట్ మార్చిన టీమిండియా
X
స్పిన్ పిచ్ వద్దని చెప్పిన టీమిండియా.. కివీస్ సిరీస్‌లో బొక్కబోర్లా పడ్డ భారత్...సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు భారత్ సిద్ధం

సౌ­తా­ఫ్రి­కా­తో రెం­డు టె­స్ట్‌ల సి­రీ­స్‌­కు టీ­మిం­డి­యా సి­ద్ద­మైం­ది. కో­ల్‌­క­తా వే­ది­క­గా శు­క్ర­వా­రం నుం­చి ప్రా­రం­భం కా­ను­న్న తొలి టె­స్ట్‌­లో ఇరు జట్లు అమీ­తు­మీ తే­ల్చు­కో­ను­న్నా­యి. వర­ల్డ్ టె­స్ట్ ఛాం­పి­య­న్‌­షి­ప్(డబ్ల్యూ­టీ­సీ)లో భా­గం­గా ఈ సి­రీ­స్ జరు­గ­ను­న్న నే­ప­థ్యం­లో వి­జ­య­మే లక్ష్యం­గా టీ­మిం­డి­యా సన్న­ద­మ­వు­తుం­ది. అయి­తే కో­ల్‌­క­తా వే­ది­క­గా జరి­గే తొలి మ్యా­చ్‌­కు ర్యాం­క్ టర్న­ర్ వద్ద­ని టీ­మిం­డి­యా మే­నే­జ్‌­మెం­ట్ కో­రి­న­ట్లు తె­లు­స్తోం­ది.

కివీస్ సిరీస్‌లో శరాఘాతం

సొం­త­గ­డ్డ­పై వి­ప­రీ­తం­గా తి­రి­గే పి­చ్‌­ల­ను ఇష్ట­ప­డే టీ­మ్‌­ఇం­డి­యా­కు ని­రు­డు న్యూ­జి­లాం­డ్‌­తో సి­రీ­స్‌ శరా­ఘా­త­మే అయిం­ది. తన స్పి­న్‌ వలలో తానే చి­క్కు­కు­ని గి­ల­గి­ల్లా­డిం­ది. స్వ­దే­శం­లో ఒక్క టె­స్టు ఓడి­పో­వ­డ­మే ఎక్కు­వ­ను­కుం­టే.. ఆ సి­రీ­స్‌­లో ఏకం­గా 0-3తో వై­ట్‌­వా­ష్‌­కు గు­రైం­ది. కి­వీ­స్‌ స్పి­న్న­ర్ల­ను ఎదు­ర్కో­వ­డం­లో భారత బ్యా­ట­ర్లు ఇబ్బం­ది­ప­డ­గా.. అదే సమ­యం­లో ఆ జట్టు బ్యా­ట­ర్ల­పై మన స్పి­న్న­ర్ల మా­యా­జా­లం పని­చే­య­లే­దు. శాం­ట్న­ర్‌ (ఒక మ్యా­చ్‌­లో 13 వి­కె­ట్లు), అజా­జ్‌ పటే­ల్‌ (3 మ్యా­చ్‌­ల్లో 15 వి­కె­ట్లు)లు టీ­మ్‌­ఇం­డి­యా­ను తమ స్పి­న్‌­తో ఉక్కి­రి­బి­క్కి­రి చే­శా­రు. ఆ సి­రీ­స్‌ ఓటమి ప్ర­పంచ టె­స్టు ఛాం­పి­య­న్‌­షి­ప్‌ (డబ్ల్యూ­టీ­సీ)లో ఇం­డి­యా ఫై­న­ల్‌ అవ­కా­శా­ల­ను దె­బ్బ­తీ­సిం­ది. ఆ నే­ప­థ్యం­లో పి­చ్‌ల వి­ష­యం­లో భా­ర­త్‌ ఆలో­చన తీరు మా­రి­పో­యిం­ది. ఇప్పు­డు గి­ర్రున తి­రి­గే పి­చ్‌­లు కా­వా­ల­ని అడ­గ­క­పో­వ­డం­లో ఆశ్చ­ర్యం లేదు. ప్ర­ధాన కో­చ్‌ గౌ­త­మ్‌ గం­భీ­ర్‌ సమ­తూ­కం ఉన్న పి­చ్‌­ల­ను కో­రు­కుం­టు­న్నా­డు. స్వ­దే­శం­లో ఎప్పు­డూ అధి­కం­గా స్పి­న్‌­కు సహ­క­రిం­చే పి­చ్‌­ల­పై ఆడి­తే జట్టు వి­దే­శా­ల్లో ఇబ్బం­ది పడు­తుం­ద­న్న­ది అతడి ఉద్దే­శం. ఇటీ­వల వె­స్టిం­డీ­స్‌­తో జరి­గిన సి­రీ­స్‌­ను కూడా అలాం­టి పి­చ్‌­ల­పై ఆడ­లే­దు. ఆ సి­రీ­స్‌­ను భా­ర­త్‌ 2-0తో గె­లు­చు­కు­న్న సం­గ­తి తె­లి­సిం­దే.

పేసర్లకే ఈ"డెన్"

సా­ధా­ర­ణం­గా ఈడె­న్ గా­ర్డె­న్స్‌­లో ఆరం­భం­లో పిచ్ పే­స­ర్ల­కు సహ­క­రి­స్తోం­ది. ఆ తర్వాత బ్యా­ట­ర్ల­కు అను­కూ­లం­గా మా­రు­తుం­ది. మ్యా­చ్ సా­గు­తు­న్నా కొ­ద్దీ స్పి­న్న­ర్లు ప్ర­భా­వం చూ­పి­స్తా­రు. స్పి­న్ పి­చ్‌­లు సి­ద్దం చే­సి­నా తమకే అడ్వాం­టే­జ్‌­గా మా­రు­తుం­ద­ని సౌ­తా­ఫ్రి­కా భా­వి­స్తోం­ది. ఇటీ­వ­లే పా­కి­స్థా­న్ పర్య­ట­న­లో ఆ జట్టు 1-1తో రెం­డు టె­స్ట్‌ల సి­రీ­స్‌­ను సమం చే­సు­కుం­ది. ఈ పర్య­ట­న­లో సౌ­తా­ఫ్రి­కా స్పి­న్న­ర్లు హర్మ­ర్(13), ము­త్తు సామి(11), కే­శ­వ్ మహ­రా­జ్(9)లు 33 వి­కె­ట్లు పడ­గొ­ట్టా­రు. ఆ జట్టు స్పి­న్ వి­భా­గం బలం­గా ఉంది. ఈ క్ర­మం­లో­నే సమ­తూ­క­మైన పి­చ్‌­ల­ను సి­ద్దం చే­యా­ల­ని హెడ్ కోచ్ గౌ­త­మ్ గం­భీ­ర్ కో­రి­న­ట్లు తె­లు­స్తోం­ది. దక్షి­ణా­ఫ్రి­కా­తో సి­రీ­స్‌­కు ఓ మో­స్త­రు­గా స్పి­న్‌­కు అను­కూ­లిం­చే పి­చ్‌­ల­ను తయా­రు చేసే అవ­కా­శ­ముం­ది. టీ­మ్‌­ఇం­డి­యా టర్నిం­గ్‌ పి­చ్‌ కా­వా­ల­ని కో­ర­లే­ద­ని బెం­గా­ల్‌ క్రి­కె­ట్‌ సంఘం అధ్య­క్షు­డు, మాజీ కె­ప్టె­న్‌ సౌ­ర­భ్‌ గం­గూ­లీ చె­ప్పా­డు. తొలి టె­స్టు శు­క్ర­వా­రం కో­ల్‌­క­తా­లో­ని ఈడె­న్‌ గా­ర్డె­న్స్‌­లో ఆరం­భం కా­ను­న్న సం­గ­తి తె­లి­సిం­దే. ఇక్కడ పి­చ్‌­పై అక్క­డ­క్కడ కా­స్త పచ్చిక ఉంది. మ్యా­చ్‌ సమ­యా­ని­కి పె­ద్ద­గా మా­ర­క­పో­వ­చ్చు ‘‘స్పో­ర్టిం­గ్‌ పి­చ్‌­ను సి­ద్ధం చే­శాం. బ్యా­ట­ర్ల­తో­పా­టు బౌ­ల­ర్ల­కూ సహ­కా­రం లభి­స్తుం­ది’’ అని ఈడె­న్‌ క్యు­రే­ట­ర్‌ సు­జ­న్‌ చె­ప్పా­డు.

Tags

Next Story