Maheesh Theekshana : పెళ్లి చేసుకున్న శ్రీలంక క్రికెటర్ మహీశ్ తీక్షణ

శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రేయసి అర్తికా యోనాలీని వివాహం చేసుకున్నారు. కొలొంబో వేదికగా జరిగిన ఈ వేడుకకు ఆ దేశ క్రికెటర్లు హాజరయ్యారు. IPL-2023, 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అతను 27 మ్యాచ్‌లలో 25 వికెట్లు తీశారు. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్‌కు ఆడనున్నారు. శ్రీలంక తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 135 వికెట్లు పడగొట్టారు.
తీక్షణ బేస్ ధర 2 కోట్ల రూపాయలు. మెగా వేలం సమయంలో ముంబై ఇండియన్స్ కూడా అతనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపింది, ఇది ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య వేలం యుద్ధానికి దారితీసింది. ముంబై ఇండియన్స్ 4.20 కోట్ల వద్ద ఆగిపోయింది, రాజస్థాన్ అతన్ని 4.40 కోట్లతో దక్కించుకుంది.
మహేశ్ తీక్షణ తన కెరీర్‌లో 60 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ 60 ఇన్నింగ్స్‌లలో అతను 58 వికెట్లు తీశాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో, అతను సగటు 26.56 మరియు ఎకానమీ రేటు 6.87. తీక్షణ 50 వన్డేల్లో 72 వికెట్లు, 2 టెస్టుల్లో 5 వికెట్లు పడగొట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com