Sunrisers Hyderabad : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ విరాళం.. !

Sunrisers Hyderabad : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ విరాళం.. !
X
దేశం కరోనాతో పోరాడుతున్న వేళ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ విరాళం ప్రకటించింది. రూ.30 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించింది.

దేశం కరోనాతో పోరాడుతున్న వేళ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ విరాళం ప్రకటించింది. రూ.30 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ రిలీఫ్ చర్యలు చేపడుతామని తెలిపింది. వివిధ ఎన్జీవోలతో కలిసి కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, మందులు పంపిణీ చేస్తామని పేర్కొంది. అలాగే సన్ టీవీ ఛానెళ్లలో కరోనాపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తామని వివరించింది.


Tags

Next Story