Sunrisers Worst Record : సన్ రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డ్

Sunrisers Worst Record : సన్ రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డ్
X

సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్న కోల్ కతాతో ఓడిపోయి ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. 2023 నుంచి ఒకే జట్టుపై వరుసగా 5సార్లు ఓడిపోయింది. 2023లో 1, 2024లో 3, నిన్న కోల్‌కతా మ్యాచ్‌లో పరాజయాలు చవిచూసింది. మరోవైపు, ఈ సీజన్‌లో ఆడిన 4 మ్యాచుల్లోనూ 3 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. గతంతో పోలిస్తే సన్ రైజర్స్ పటిష్ఠంగానే కనిపిస్తున్నా వరుస ఓటములు ఊహించనివి. టాప్ ఆర్డర్ వైఫల్యమే ఆ జట్టుకు శాపంగా కన్పిస్తోంది.

ఐపీఎల్ 2025 సీజన్లో కమిన్స్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. నిన్న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్ కతాపై మ్యాచులో సరిగా బౌలింగ్ మార్పులు చేయలేకపోయారు. స్పిన్నర్లు రెండు వికెట్లు తీసినా వారిని కంటిన్యూ చేయలేదు. 8 ఓవర్లు స్పిన్నర్లు వేసేందుకు ఛాన్స్ ఉన్నా పేసర్లతో వేయించి మూల్యం చెల్లించుకున్నారు. మరోవైపు కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ కలిసి 8 ఓవర్లలో 4 వికెట్లు తీసి సన్ రైజర్స్ ను దెబ్బకొట్టారు.

Tags

Next Story