Sunrisers Hyderabad-Mumbai Indians : కీలక పోరుకు సన్ రైజర్స్ సిద్ధం

Sunrisers Hyderabad-Mumbai Indians :   కీలక పోరుకు సన్ రైజర్స్ సిద్ధం
X

ఐపీఎల్ 2025 సీజన్ లో వరుస పరాజయాలతో సతమవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ కు చాలా కీలకంగా మారింది. టోర్నీలో నిలవాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే. ఇక గత మ్యాచ్లో ముంబైచేతిలో వాంఖడేలో జరిగిన ఘోర పరాభవానికి కూడా ప్రతీకారం తీర్చుకునేందుకు కమిన్స్ సేన అన్ని విధాలుగా రెడీ అయింది. ఈ సీజన్ను అద్భుతం గా ఆరంభించిన సన్ రైజర్స్ తర్వాత పూర్తిగా తేలిపోయింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడి కేవలం రెండిట్లోనే గెలిచింది. మిగతా ఐదు మ్యాచుల్లో చిత్తయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో క్రింది నుంచి 2వ స్థానంలో నిలిచింది.

గత ముంబై మ్యాచ్లు ముందు హైదరాబాద్లో జరి గిన హై స్కోరింగ్ మ్యాచ్ లో పటిష్టమైన పంజాబ్ కింగ్స్ పై మాత్రం సన్ రైజర్స్ సంచలన విజయం సాధించింది. 200 ప్లస్ స్కోరును ఛేదించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. కానీ, తర్వాత ముంబైలో జరిగిన మ్యాచ్లో మళ్లీ ఓటమి చవి చూసింది. ఇప్పుడు అదే ముంబై ఇండియన్స్తో సొంతగడ్డ పై తలపడేందుకు సిద్ధమైంది.

ప్రస్తుతం ఇరుజట్లలోనూ బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో బ్యాటింగ్కు అచ్చి వచ్చే ఉప్పల్ పిచ్ పై భారీ స్కోర్లు నమోదవడం ఖాయమనిపిస్తోంది. కాగా, ఈ టోర్నీ లో హైదరాబాద్ గెలిచిన రెండు మ్యాచుల్లోనూ ఓపెనర్ల పాత్ర కీలకంగా ఉంది. వారు శుభారంభాలు అందిస్తేనే జట్టు భారీ స్కోర్లు సాధిస్తోంది. లేదంటే అందరూ తేలిపోతు న్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్పైనే జట్టు భారమంతా ఉంటుంది. వారు త్వరగా అవుటైతే మిగతా బ్యాటర్లందరూ వరుసగా పెవిలియన్కు క్యూ కడుతున్నారు. తొలి మ్యాచ్ లో సూపర్ సెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ తర్వాత ఆరు మ్యాచుల్లో పూర్తిగా విఫలమయ్యాడు.

Tags

Next Story