Suryakumar Yadav : బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ కు సూర్య రెడీ
ఇటీవల జరిగిన బుచ్చిబాబు టోర్నీలో గాయపడ్డ సూర్యకుమార్ యాదవ్ దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. దీంతో తన ఫామ్‌ని నిరూపించుకుని బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ జట్టులో చోటు సంపాదించాలనుకున్నాడు. కానీ, గాయపడటంతో సూర్య ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. కుడి చేతి బొటనవేలు గాయంతో బాధపడుతున్న సూర్య.. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఎలో కోలుకుంటున్నాడు. ఇటీవల బీసీసీఐ వర్గాలు సూర్యని కలిశాయి. అతను వంద శాతం కోలుకున్నట్లు తెలిపాయి. అంతేకాదు.. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో ఆడటానికి సూర్య సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. ఈ నెల 12 నుంచి జరిగే దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లో సూర్య ఆడట్లేదు.ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే మూడో రౌండ్ మ్యాచ్‌లో సూర్య ఆడే అవకాశాలున్నాయి. సూర్య టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే దులీప్ ట్రోఫీ అతడికి కీలకం. ఇక్కడ బాగా ఆడితేనే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లకు పోటీలో ఉండే చాన్స్ ఉంటుంది. అయితే, అక్టోబర్ లో బంగ్లాదేశ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com