T20 WORLD CUP: గెలిచినా టీమిండియాకు తప్పని టెన్షన్

T20 WORLD CUP: గెలిచినా టీమిండియాకు తప్పని టెన్షన్
X
టీమిండియాలో వైఫల్యాలు... నమీబియాతో మ్యాచ్ లో బట్టబయలు... కుప్పకూలిన బ్యాటింగ్.. మిడిలార్డర్ వైఫల్యం... పాక్ మ్యాచ్‌కు వ్యూహం ఏంటి

ఢి­ల్లీ­లో­ని అరు­ణ్ జై­ట్లీ స్టే­డి­యం వే­ది­క­గా గు­రు­వా­రం జరి­గిన మ్యా­చ్‌­లో భా­ర­త్ 93 పరు­గుల భారీ తే­డా­తో నమీ­బి­యా­ను ఓడిం­చిం­ది. రన్స్ పరం­గా టీ20 ప్ర­పంచ కప్ చరి­త్ర­లో భా­ర­త్‌­కు ఇది అతి­పె­ద్ద వి­జ­యం. గతం­లో 2012లో ఇం­గ్లం­డ్ జట్టు­పై సా­ధిం­చిన 90 పరు­గుల రి­కా­ర్డు­ను సూ­ర్య సేన తి­ర­గ­రా­సిం­ది. అయి­తే ఈ భారీ వి­జ­యం వె­నుక కొ­న్ని ఆం­దో­ళ­న­క­ర­మైన అం­శా­లు దాగి ఉన్నా­యి. ఇది రా­బో­యే పా­కి­స్థా­న్ మ్యా­చ్‌­కు ముం­దు జట్టు­ను హె­చ్చ­రి­స్తు­న్నా­యి. ఈ మ్యా­చ్‌­లో భారత ఓపె­న­ర్లు వి­ధ్వం­స­కర ఆరం­భా­న్ని ఇచ్చా­రు. ము­ఖ్యం­గా ఇషా­న్ కి­ష­న్ కే­వ­లం 24 బం­తు­ల్లో 61 పరు­గు­లు చేసి పవ­ర్‌­ప్లే­లో నమీ­బి­యా బౌ­ల­ర్ల­ను చీ­ల్చి­చెం­డా­డా­డు. ఫలి­తం­గా భా­ర­త్ కే­వ­లం 6.5 ఓవ­ర్ల­లో­నే 100 పరు­గుల మై­లు­రా­యి­ని అం­దు­కుం­ది. టీ20 ప్ర­పం­చ­క­ప్ చరి­త్ర­లో ఒక జట్టు సా­ధిం­చిన అత్యంత వే­గ­వం­త­మైన సెం­చ­రీ ఇదే కా­వ­డం వి­శే­షం. ఆ తర్వాత హా­ర్ది­క్ పాం­డ్యా (52 పరు­గు­లు) తన­దైన శై­లి­లో ఫి­ని­షిం­గ్ టచ్ ఇచ్చి స్కో­రు­ను 200 దా­టిం­చా­డు. అయి­తే ఈ మ్యా­చ్‌­లో భా­ర­త్ కే­వ­లం 5 పరు­గుల వ్య­వ­ధి­లో 5 వి­కె­ట్లు కో­ల్పో­వ­డం అం­ద­రి­నీ ఆశ్చ­ర్య­ప­రి­చిం­ది.

భారీ స్కోరు సాధించినప్పటికీ.. టీమిండియా మిడిలార్డర్ ప్రదర్శన ప్రశ్నార్థకంగా మారింది. అమెరికాపై జరిగిన గత మ్యాచ్‌లో లాగే ఇక్కడ కూడా లోయర్ మిడిలార్డర్ తడబడింది. సంజూ శాంసన్ ఆరంభం బాగున్నా దానిని భారీ ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం 12 పరుగులకే వెనుదిరగగా.. రింకూ సింగ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే.. ఇన్నింగ్స్ చివరలో భారత్ కేవలం 5 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోవడం. ఇది జట్టు బ్యాటింగ్ లైనప్, ఒత్తిడిలో ఆడే తీరుపై అనుమానాలను రేకెత్తిస్తోంది.

బలహీనతలను బయటపెట్టిన స్పెల్

నమీ­బి­యా కె­ప్టె­న్ గె­ర్హా­ర్డ్ ఇరా­స్మ­స్ వే­సిన బౌ­లిం­గ్ స్పె­ల్ భారత బ్యా­ట­ర్ల బల­హీ­న­త­ల­ను బయ­ట­పె­ట్టిం­ది. 4 వి­కె­ట్లు తీసి భారత జో­రు­కు అడ్డు­క­ట్ట వే­సిన ఇరా­స్మ­స్ బౌ­లిం­గ్ తీరు.. ఆది­వా­రం పా­కి­స్థా­న్‌­తో జరి­గే మ్యా­చ్‌­లో పాక్ 'మి­స్ట­రీ' స్పి­న్న­ర్ ఉస్మా­న్ తా­రి­క్ నుం­చి ఎదు­ర­య్యే సవా­ళ్ల­ను గు­ర్తు చే­స్తోం­ది. సైడ్-ఆర్మ్ బౌ­లిం­గ్‌­ను ఎదు­ర్కో­వ­డం­లో భా­ర­త్ ఇంకా మె­రు­గు­ప­డా­ల్సి ఉం­ద­ని ఈ మ్యా­చ్ స్ప­ష్టం చే­సిం­ది. ఫి­బ్ర­వ­రి 15న పా­కి­స్థా­న్‌­తో జరి­గే పోరు సూ­ప­ర్-8 ది­శ­గా భా­ర­త్‌­కు అత్యంత కీ­ల­కం. ఈ మ్యా­చ్‌­లో గె­ల­వా­లం­టే భా­ర­త్ తన మి­డి­లా­ర్డ­ర్ స్థి­ర­త్వం­పై దృ­ష్టి పె­ట్టా­లి. ము­ఖ్యం­గా చి­వ­ర­లో వి­కె­ట్లు పా­రే­సు­కో­కుం­డా జా­గ్ర­త్త పడా­లి. నమీ­బి­యా­పై వి­జ­యం­తో వచ్చిన ఉత్సా­హా­న్ని కొ­న­సా­గి­స్తూ­నే, బ్యా­టిం­గ్‌­లో జరి­గిన పొ­ర­పా­ట్ల­ను సరి­ది­ద్దు­కుం­టే­నే చి­ర­కాల ప్ర­త్య­ర్థి­పై పై­చే­యి సా­ధిం­చే అవ­కా­శం ఉం­టుం­ది.

ఆశలు రేపుతున్న స్పిన్ జోడీ

బ్యా­టిం­గ్‌­లో కొ­న్ని లో­పా­లు ఉన్న­ప్ప­టి­కీ.. బౌ­లిం­గ్ వి­భా­గం­లో భా­ర­త్ ఆత్మ­వి­శ్వా­సం­తో కని­పి­స్తోం­ది. వరు­ణ్ చక్ర­వ­ర్తి (2 ఓవ­ర్ల­లో 3/7) తన మ్యా­జి­క్ స్పి­న్‌­తో నమీ­బి­యా­ను కో­లు­కో­కుం­డా చే­య­గా.. అక్ష­ర్ పటే­ల్ తన కం­ట్రో­ల్ బౌ­లిం­గ్‌­తో రెం­డు వి­కె­ట్లు తీసి ఒత్తి­డి పెం­చా­డు. హా­ర్ది­క్ పాం­డ్యా ఆల్ రౌం­డ్ ప్ర­ద­ర్శ­న­తో 2 వి­కె­ట్లు తీసి 'ప్లే­య­ర్ ఆఫ్ ది మ్యా­చ్'­గా ని­ల­వ­డం పా­కి­స్థా­న్ జట్టు­కు గట్టి హె­చ్చ­రి­కే అని చె­ప్పా­లి.

Tags

Next Story