T20 WORLD CUP: గణాంకాలాన్నీ మన వైపే..కానీ ఇదీ సెమీస్

టీ20 వరల్డ్‌కప్ 2026 టోర్నీ కీలక దశకు చేరుకున్న వేళ క్రికెట్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఒకే మ్యాచ్‌పై నిలిచింది. ముంబయిలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా నేడు భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్–2లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమ్ఇండియా ఈ కీలక పోరులో విజయం సాధించి మరోసారి ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఇంగ్లాండ్ కూడా బలమైన జట్టుగా నిలుస్తుండటంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ మరింత పెరిగింది.
టీ20 ఫార్మాట్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం 29 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో భారత్ 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఇంగ్లాండ్ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ గణాంకాలు చూస్తే భారత్‌కు కొంత పైచేయి ఉన్నట్లు కనిపించినా, ఇంగ్లాండ్ కూడా పోటీగా నిలిచినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు టీ20ల్లో దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులకు గట్టి సవాలు విసురుతుంది. స్వదేశంలో జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే భారత్‌కు మరింత బలమైన రికార్డు ఉంది. భారత్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా 10 సార్లు విజయం సాధించగా, ఇంగ్లాండ్ 6 సార్లు మాత్రమే గెలిచింది. మరోవైపు ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ నాలుగు విజయాలు సాధించగా, ఇంగ్లాండ్ ఐదు సార్లు గెలిచింది. తటస్థ వేదికల్లో కూడా భారత్ కొంత ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇలాంటి గణాంకాలు ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎంత సమతూకంగా ఉందో చూపిస్తున్నాయి. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో కూడా భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆసక్తికరమైన పోటీ కొనసాగుతోంది.
సెమీఫైనల్ రద్దు అయితే
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భాగంగా నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా - ఇంగ్లాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచులకు రిజర్వు డేలను అధికారికంగా ప్రకటించింది ఐసీసీ.బతైం ఇండియా - ఇంగ్లాండ్ మ్యాచ్‌కి మార్చి 6న రిజర్వు డేగా ఉంటుంది. మ్యాచ్ రోజు ఆట ప్రారంభమై, వర్షం లేదా మరే కారణంగా అయినా అంతరాయం ఏర్పడితే.. ఎక్కడైతే ఆట ఆగిందో అక్కడి నుంచి రిజర్వు డే రోజు మ్యాచ్ తిరిగి నిర్వహించబడుతుంది. ఒకవేళ మార్చి 5న భారత జట్టు బ్యాటింగ్ చేస్తూ6.2 ఓవర్లలో 58/2 స్కోరుతో ఉంటే.. రిజర్వు డే రోజున 6.3 ఓవర్ల నుంచే మ్యాచ్ మొదలవుతుంది. గ్రూప్ స్టేజీలో చెరో ఐదు ఓవర్ల పాటు మ్యాచ్ సాగినా రిజల్ట్‌ని డిసైడ్ చేస్తారు.
అయితే సెమీ ఫైనల్ మ్యాచుల్లో మాత్రం డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ రిజల్ట్ తేల్చాలంటే కనీసం చెరో 10 ఓవర్లు మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. 9.5 ఓవర్లకు మ్యాచ్ ఆగినా రిజర్వు డేకి వెళ్లక తప్పదు. సెమీ ఫైనల్స్‌కి నిర్ణీత సమయం కంటే మరో గంటన్నర అదనంగా సమయం కేటాయించింది ఐసీసీ. ఉదాహరణకు సాధారణంగా 7 గంటలకు మొదలయ్యే మ్యాచ్, వర్షం కారణంగా ఆలస్యమైతే రాత్రి 9:30 వరకూ చూసి.. ఆ రోజు ఆటను రద్దు చేస్తారు. అయితే సెమీ ఫైనల్స్‌లో మరో గంటన్నర రాత్రి 11 గంటల వరకూ వేచి చూసిన తర్వాతే ఆటను రద్దు చేయాల్సి ఉంటుంది. దీంతో మ్యాచ్ పూర్తి చేసేందుకు మరో 2 గంటలు అదనంగా ఉంటుంది. ఒకవేళ వరుసగా రెండు రోజులు వర్షం కురిస్తే మాత్రం టీమిండియాకి పెద్ద దెబ్బే. సూపర్ 8 రౌండ్లో టేబుల్ టాపర్‌గా నిలిచిన కారణంగా సెమీ ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే.. ఇంగ్లాండ్ ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది. సూపర్ 8 రౌండ్లో సౌతాఫ్రికాతో మ్యాచ్ ఓడిన భారత జట్టు, టోర్నీ నుంచి నిష్కమించాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
