T20 WORLD CUP: టీమిండియా జగజ్జేత

T20 WORLD CUP: టీమిండియా జగజ్జేత
X
ఫైనల్లో ఏకపక్ష విజయం.. ప్రపంచ క్రికెట్‌లో మళ్లీ భారత్ ఆధిపత్యం

టీ­మిం­డి­యా అద్భు­త­మైన ఆట­తీ­రు­తో మరో­సా­రి ప్ర­పంచ క్రి­కె­ట్‌­పై తన ఆధి­ప­త్యా­న్ని చా­టు­కుం­ది. ప్రా­రం­భం­లో కొంత తడ­బా­టు కని­పిం­చి­నా, అసలు సమయం వచ్చి­న­ప్పు­డు అసా­ధా­ర­ణం­గా పుం­జు­కు­ని ప్ర­త్య­ర్థు­ల­ను చి­త్తు­గా ఓడి­స్తూ టీ20 ప్ర­పం­చ­క­ప్‌­ను ఘనం­గా కై­వ­సం చే­సు­కుం­ది. బ్యా­టిం­గ్‌, బౌ­లిం­గ్‌ వి­భా­గా­ల్లో సమ­న్వ­యం­తో ఆడిన భారత జట్టు అభి­మా­ను­ల­కు మరి­చి­పో­లే­ని వి­జ­యా­న్ని అం­దిం­చిం­ది. కీలక మ్యా­చ్‌­ల­లో అసా­ధా­రణ ప్ర­ద­ర్శన చే­స్తూ, ఒత్తి­డి­ని జయిం­చి, అద్భు­త­మైన పో­రా­ట­స్ఫూ­ర్తి­తో కప్పు­ను ము­ద్దా­డిం­ది. కో­ట్లా­ది భారత అభి­మా­నుల హృ­ద­యా­ల్లో ఆనం­దా­న్ని నిం­పిన ఈ వి­జ­యం భారత క్రి­కె­ట్ చరి­త్ర­లో మరో చి­ర­స్మ­ర­ణీయ అధ్యా­యం­గా ని­లి­చిం­ది. అహ్మ­దా­బా­ద్‌­లో­ని నరేం­ద్ర మోదీ స్టే­డి­యం వే­ది­క­గా జరి­గిన ఫై­న­ల్లో టీ­మిం­డి­యా పూ­ర్తి­స్థా­యి ఆధి­ప­త్యం ప్ర­ద­ర్శిం­చిం­ది. టా­స్‌ గె­లి­చి ముం­దు­గా బ్యా­టిం­గ్‌ చే­సిన భా­ర­త్‌ భారీ స్కో­రు సా­ధిం­చిం­ది. స్టా­ర్‌ బ్యా­ట­ర్ సంజు శాం­స­న్ అద్భు­త­మైన ఫా­మ్‌­ను కొ­న­సా­గి­స్తూ కి­వీ­స్‌ బౌ­ల­ర్ల­పై ధా­టి­గా వి­రు­చు­కు­ప­డ్డా­డు. అతని దూ­కు­డైన బ్యా­టిం­గ్‌­తో స్కో­రు వే­గం­గా పె­రి­గిం­ది. అత­ని­కి తో­డు­గా ఇతర బ్యా­ట­ర్లు కూడా కీలక పరు­గు­లు జో­డిం­చ­డం­తో భా­ర­త్‌ భారీ లక్ష్యా­న్ని ని­ల­బె­ట్ట­గ­లి­గిం­ది.

లక్ష్య­చే­ద­న­కు ది­గిన న్యూ­జి­లాం­డ్‌­కు భారత బౌ­ల­ర్లు ప్రా­రం­భం నుం­చే కట్టు­ది­ట్ట­మైన బౌ­లిం­గ్‌­తో ఒత్తి­డి తీ­సు­కొ­చ్చా­రు. ము­ఖ్యం­గా అక్ష­ర్ పటే­ల్‌, జస్ప్రీ­త్ బు­మ్రా అద్భు­తం­గా బౌ­లిం­గ్‌ చే­స్తూ కి­వీ­స్‌ బ్యా­ట­ర్ల­కు చె­క్‌ పె­ట్టా­రు. వరు­స­గా వి­కె­ట్లు తీ­స్తూ మ్యా­చ్‌­ను పూ­ర్తి­గా భారత వైపు తి­ప్పే­శా­రు. మధ్య మధ్య­లో న్యూ­జి­లాం­డ్‌ బ్యా­ట­ర్లు పో­రా­డేం­దు­కు ప్ర­య­త్నిం­చి­నా భారత బౌ­లిం­గ్ దా­డి­కి ఎదు­రు­లే­క­పో­యా­రు. చి­వ­రి­కి న్యూ­జి­లాం­డ్‌­ను తక్కువ స్కో­రు­కే కట్ట­డి చే­సిన భా­ర­త్‌ ఘన వి­జ­యం సా­ధిం­చిం­ది. దీం­తో టీ­మిం­డి­యా మూ­డో­సా­రి టీ20 ప్ర­పం­చ­క­ప్‌­ను కై­వ­సం చే­సు­కు­ని కొ­త్త చరి­త్ర సృ­ష్టిం­చిం­ది. ము­ఖ్యం­గా డి­ఫెం­డిం­గ్‌ ఛాం­పి­య­న్‌­గా కప్పు­ను ని­ల­బె­ట్టు­కు­న్న తొలి జట్టు­గా ని­ల­వ­డం మరింత ప్ర­త్యే­కం­గా ని­లి­చిం­ది. సొంత ప్రేక్షకుల మధ్య కప్పును అందుకుంది.

Tags

Next Story