T20WORLD CUP: పసికూనను కసిగా కొట్టేశారు

T20WORLD CUP: పసికూనను కసిగా కొట్టేశారు
X
జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. విధ్వంసం సృష్టించిన భారత బ్యాటర్లు... చెలరేగిన అభిషేక్, పాండ్యా, తిలక్ వర్మ

టీ20 ప్రపంచకప్ సూపర్‌-8 దశలో కీలక సమయంలో టీమ్‌ఇండియా చివరికి తన అసలు శక్తిని చూపించింది. ఫామ్‌పై ఆందోళనలు, బౌలింగ్‌పై విమర్శలు, సెమీఫైనల్ అవకాశాలపై సందేహాలు అన్నీ మ్యాచ్‌లో కొట్టిపారేసిన ప్రదర్శన ఇది. బ్యాటర్లు సమష్టిగా చెలరేగిన వేళ, భారీ స్కోరు కట్టి, ఒత్తిడిలోనూ మ్యాచ్‌ను కట్టుదిట్టంగా ముగించిన భారత్… జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సెమీస్‌ రేసులో నిలబడాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ స్థాయి ప్రదర్శన రావడం భారత అభిమానులకు ఊరటనిచ్చింది. మరోవైపు వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా గెలవడం భారత్‌పై ఒత్తిడిని కొంత తగ్గించింది. అయితే బౌలింగ్‌లో ఇంకా మెరుగుదల అవసరమనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపించాయి.

చె­న్నై వే­ది­క­గా జరి­గిన ఈ సూ­ప­ర్‌-8 పో­రు­లో టాస్ గె­లి­చిన జిం­బా­బ్వే ముం­దు­గా బౌ­లిం­గ్ ఎం­చు­కుం­ది. పి­చ్‌­పై రన్స్ వస్తా­య­న్న అం­చ­నా­లు ని­జ­మ­య్యా­యి. భా­ర­త్‌ బ్యా­ట­ర్లు ఆరం­భం నుం­చే దూ­కు­డు ప్ర­ద­ర్శిం­చా­రు. సంజూ శాం­స­న్‌ (24) రెం­డో బం­తి­నే సి­క్స్‌­గా మలి­చి తమ ఉద్దే­శా­న్ని స్ప­ష్టం­చే­శా­డు. అత­ని­కి జతగా అభి­షే­క్ శర్మ (55) సా­హ­సో­పే­త­మైన షా­ట్ల­తో చె­ల­రే­గి­పో­యా­డు. తొలి వి­కె­ట్‌­కు 48 పరు­గుల భా­గ­స్వా­మ్యం నె­ల­కొ­ల్పిన ఈ జోడీ భా­ర­త్‌­కు బల­మైన బేస్ ఇచ్చిం­ది. అభిషేక్‌ శర్మకు ఇది ఎంతో కీలక ఇన్నింగ్స్. గత మ్యాచ్‌ల్లో ఫామ్ లేక విమర్శలు ఎదుర్కొన్న అతడు ఈసారి ధనాధన్ బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. మపోసా, ముజరబాని బౌలింగ్‌లో వరుసగా బౌండరీలు బాదుతూ పవర్‌ప్లేలోనే జింబాబ్వే బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. రజా బౌలింగ్‌లో సింగిల్ తీసి కేవలం 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేయడం అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది.

అభి­షే­క్ ఔట­య్యాక కూడా భా­ర­త్ వేగం తగ్గ­లే­దు. ఇషా­న్ కి­ష­న్‌ (38) తన సహజ దూ­కు­డు­తో బౌం­డ­రీ­లు బా­దా­డు. అత­డి­తో కలి­సి అభి­షే­క్ 72 పరు­గుల భా­గ­స్వా­మ్యం నె­ల­కొ­ల్ప­డం స్కో­రు బో­ర్డు­ను పరు­గు­లు పె­ట్టిం­చిం­ది. అనం­త­రం సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్‌ (33) క్రీ­జు­లో­కి వచ్చి తొలి బం­తి­నే స్వీ­ప్‌­తో బౌం­డ­రీ­కి తర­లిం­చి తన స్టై­ల్ చూ­పిం­చా­డు. కే­వ­లం 13 బం­తు­ల్లో 33 పరు­గు­లు చేసి మ్యా­చ్‌­ను మరింత భా­ర­త్ వైపు మలి­చా­డు. 15వ ఓవ­ర్లో భా­ర­త్ స్కో­రు 172 వద్ద ఉం­డ­గా, అక్క­డి నుం­చి అసలు వి­ధ్వం­సం మొ­ద­లైం­ది. హా­ర్ది­క్ పాం­డ్యా (50 నా­టౌ­ట్‌) మరి­యు తి­ల­క్ వర్మ (44 నా­టౌ­ట్‌) జంట జిం­బా­బ్వే బౌ­లిం­గ్‌­ను చీ­ల్చి­చెం­డా­డిం­ది. చి­వ­రి 5 ఓవ­ర్ల­లో ఏకం­గా 80 పరు­గు­లు రా­బ­ట్ట­డం మ్యా­చ్ టర్నిం­గ్ పా­యిం­ట్ అయిం­ది. 31 బం­తు­ల్లో 84 పరు­గుల అభే­ద్య భా­గ­స్వా­మ్యం­తో ఐదో వి­కె­ట్‌­కు జో­డిం­చిన ఈ జంట భారత స్కో­రు­ను 4 వి­కె­ట్ల­కు 256 పరు­గుల భారీ స్థా­యి­కి తీ­సు­కె­ళ్లిం­ది. చి­వ­రి రెం­డు బం­తు­ల­ను హా­ర్ది­క్ సి­క్స్‌­లు­గా మల­చ­డం ప్రే­క్ష­కు­ల్లో ఉత్సా­హా­న్ని రె­ట్టిం­పు చే­సిం­ది. ఈ ఇన్నిం­గ్స్‌­కు హా­ర్ది­క్‌ ‘ప్లే­య­ర్ ఆఫ్ ది మ్యా­చ్’గా ని­లి­చా­డు.

257 పరు­గుల లక్ష్యం­తో బరి­లో­కి ది­గిన జిం­బా­బ్వే ఆరం­భం బా­గా­నే చే­సిం­ది. పవ­ర్‌­ప్లే ము­గి­సే సమ­యా­ని­కి వి­కె­ట్ కో­ల్పో­కుం­డా 44 పరు­గు­లు చే­సిం­ది. కానీ లక్ష్యం పె­ద్ద­ది­గా ఉం­డ­టం­తో అవ­స­ర­మైన రన్‌­రే­ట్ క్ర­మం­గా పె­రి­గిం­ది. ఏడో ఓవ­ర్లో మరు­మా­ని (20)ను అక్ష­ర్ పటే­ల్ ఔట్ చే­య­డం­తో భా­ర­త్‌­కు తొలి బ్రే­క్ లభిం­చిం­ది. అయి­తే మరో ఓపె­న­ర్ బె­నె­ట్ అద్భుత పో­రా­టం చే­శా­డు. ఈ మ్యా­చ్‌­లో భా­ర­త్ బ్యా­టిం­గ్ వి­భా­గం తన పూ­ర్తి సా­మ­ర్థ్యా­న్ని చూ­పిం­చిం­ది. టాప్ ఆర్డ­ర్ నుం­చి ఫి­ని­ష­ర్ల వరకూ అం­ద­రూ కలి­సి చె­ల­రే­గిన ఈ ఇన్నిం­గ్స్ టీమ్ ఆత్మ­వి­శ్వా­సా­న్ని పెం­చిం­ది.

Tags

Next Story