T20 WPRLD CUP: నేడే టీమిండియా డూ ఆర్ డై మ్యాచ్

T20 WPRLD CUP:  నేడే టీమిండియా డూ ఆర్ డై మ్యాచ్
X
టీమిండియా సెమీస్ చేరాలంటే.. ఇలా గెలవాలంతే

టీ20 ప్ర­పం­చ­క­ప్ 2026 సూ­ప­ర్-8 దశలో భారత జట్టు పరి­స్థి­తి ఇప్పు­డు అత్యంత కీలక మలు­పు­లో ని­లి­చిం­ది. దక్షి­ణా­ఫ్రి­కా చే­తి­లో 76 పరు­గుల తే­డా­తో ఎదు­రైన భారీ ఓటమి తర్వాత సె­మీ­ఫై­న­ల్ అవ­కా­శా­లు గణ­నీ­యం­గా సం­క్లి­ష్ట­మ­య్యా­యి. ఇకపై సా­ధా­రణ వి­జ­యా­లు సరి­పో­వు. భారీ తే­డా­తో గె­ల­వ­డం తప్ప టీ­మిం­డి­యా­కు మరో మా­ర్గం లేదు. ము­ఖ్యం­గా నెట్ రన్‌­రే­ట్ సమీ­క­ర­ణా­లు భారత భవి­ష్య­త్తు­ను ని­ర్ణ­యిం­చే స్థా­యి­కి చే­రు­కు­న్నా­యి. మ్యా­చ్ ఫలి­తం­తో పాటు గె­లు­పు తేడా కూడా సమా­నం­గా కీ­ల­కం కా­వ­డం­తో, జిం­బా­బ్వే­తో జర­గ­బో­యే మ్యా­చ్ ని­జ­మైన అర్ధం­లో ‘డూ ఆర్ డై’ సమ­రం­గా మా­రిం­ది. సూ­ప­ర్-8లో భా­ర­త్ ఇంకా జిం­బా­బ్వే, వె­స్టిం­డీ­స్ జట్ల­తో మ్యా­చ్‌­లు ఆడా­ల్సి ఉంది. సె­మీ­స్ రే­సు­లో ని­ల­వా­లం­టే ఈ రెం­డు మ్యా­చ్‌­ల్లో­నూ వి­జ­యం సా­ధిం­చ­డం తప్ప­ని­స­రి. రెం­డు వి­జ­యా­లు సా­ధి­స్తే భా­ర­త్ ఖా­తా­లో నా­లు­గు పా­యిం­ట్లు చే­ర­తా­యి. అయి­తే పా­యిం­ట్లు మా­త్ర­మే సరి­పో­వు. ప్ర­స్తు­తం భా­ర­త్ నెట్ రన్‌­రే­ట్ -3.800గా ఉంది. అదే గ్రూ­ప్‌­లో ఉన్న వె­స్టిం­డీ­స్ రన్‌­రే­ట్ 5.350గా ఉం­డ­గా, దక్షి­ణా­ఫ్రి­కా 3.800తో ముం­దం­జ­లో ఉంది. ఈ గణాం­కా­లు భారత స్థి­తి­ని ఎంత క్లి­ష్టం­గా మా­ర్చా­యో స్ప­ష్టం చే­స్తు­న్నా­యి.

ఇలాం­టి సమ­యం­లో చె­న్నై­లో­ని చి­దం­బ­రం స్టే­డి­యం­లో జిం­బా­బ్వే­తో జర­గ­ను­న్న మ్యా­చ్‌­పై ఆస­క్తి నె­ల­కొం­ది. తాజా సమా­చా­రం ప్ర­కా­రం ఈ మ్యా­చ్ కోసం వి­ని­యో­గిం­చ­బో­యే పి­చ్‌­ను ఇప్ప­టి­వ­ర­కు దే­శ­వా­ళీ మ్యా­చ్‌­ల­కు ఉప­యో­గిం­చ­లే­ద­ని తె­లు­స్తోం­ది. అది బ్యా­టిం­గ్‌­కు అను­కూ­లం­గా ఉం­డొ­చ్చ­ని, బంతి బ్యా­ట్‌­పై చక్క­గా వచ్చే అవ­కా­శం ఉం­ద­ని సమా­చా­రం. ఈ పరి­ణా­మం భారత అభి­మా­ను­ల్లో కొంత ఆశను నిం­పు­తోం­ది. భారీ స్కో­ర్లు నమో­ద­య్యే అవ­కా­శ­ముం­టే, అదే భా­ర­త్‌­కు నెట్ రన్‌­రే­ట్ మె­రు­గు­ప­ర­చు­కు­నే అవ­కా­శం కూడా అవు­తుం­ది.

భా­ర­త్ ముం­దు­గా బ్యా­టిం­గ్ చే­స్తే పరి­స్థి­తి ఎలా ఉం­టుం­ది? వి­శ్లే­ష­కుల అం­చ­నాల ప్ర­కా­రం కనీ­సం 0.01 నెట్ రన్‌­రే­ట్ సా­ధిం­చా­లం­టే కనీ­సం 77 పరు­గుల తే­డా­తో గె­ల­వా­లి. ఉదా­హ­ర­ణ­కు భా­ర­త్ 200 పరు­గు­లు చే­స్తే, ప్ర­త్య­ర్థి­ని 123 లోపే కట్ట­డి చే­యా­లి. చి­న్న తే­డా­తో గె­లి­స్తే రన్‌­రే­ట్‌­లో పె­ద్ద మా­ర్పు ఉం­డ­దు. అప్పు­డు సె­మీ­ఫై­న­ల్ ఆశలు మరింత క్లి­ష్ట­మ­వు­తా­యి. అం­దు­వ­ల్ల పవ­ర్‌­ప్లే నుం­చే దూ­కు­డైన ఆరం­భం అవ­స­రం. మధ్య ఓవ­ర్ల­లో రన్‌­రే­ట్ తగ్గ­కుం­డా చూ­సు­కో­వా­లి. చి­వ­రి ఓవ­ర్ల­లో ఫి­ని­ష­ర్లు వేగం పెం­చా­లి. అదే సమ­యం­లో బౌ­ల­ర్లు ప్ర­త్య­ర్థి­ని త్వ­ర­గా ఆలౌ­ట్ చే­యా­లి. బ్యా­టిం­గ్, బౌ­లిం­గ్ వి­భా­గా­లు సమ­న్వ­యం­తో ఆడి­తే­నే భా­ర­త్‌­కు ప్ర­యో­జ­నం ఉం­టుం­ది. లక్ష్యా­న్ని ఛే­దిం­చే పరి­స్థి­తి వస్తే సవా­లు ఇంకా పె­రు­గు­తుం­ది. ఎంత తక్కువ బం­తు­ల్లో లక్ష్యా­న్ని చే­రు­కుం­టే అంత మం­చి­ది. ఉదా­హ­ర­ణ­కు 101 పరు­గుల లక్ష్యా­న్ని 7.1 ఓవ­ర్ల­లో, 121 పరు­గు­ల­ను 8.4 ఓవ­ర్ల­లో, 141 పరు­గు­ల­ను 10 ఓవ­ర్ల­లో, 161 పరు­గు­ల­ను 11.3 ఓవ­ర్ల­లో, 181 పరు­గు­ల­ను 12.5 ఓవ­ర్ల­లో పూ­ర్తి చే­స్తే­నే నెట్ రన్‌­రే­ట్ 0.01కు చేరే అవ­కా­శం ఉం­టుం­ది. అంటే సా­ధా­రణ ఛేదన సరి­పో­దు. అత్యంత వే­గం­గా మ్యా­చ్ ము­గిం­చా­ల్సిన పరి­స్థి­తి. ఒక­వేళ మ్యా­చ్ చి­వ­రి ఓవ­ర్ల వరకు వె­ళ్తే, గె­లి­చి­నా నెట్ రన్‌­రే­ట్‌­లో పె­ద్ద మా­ర్పు ఉం­డ­క­పో­వ­చ్చు.

సూపర్-8 సమీకరణాలు కూడా ఆసక్తికరంగా మారాయి. భారత్ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే, దక్షిణాఫ్రికా కూడా మిగతా మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత్‌కు సెమీస్ అవకాశాలు బలపడతాయి. కానీ దక్షిణాఫ్రికా వెస్టిండీస్ చేతిలో ఓడిపోతే మూడు జట్లూ నాలుగు పాయింట్లతో సమాన స్థితిలో నిలుస్తాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగానే సెమీస్‌కు వెళ్లే రెండు జట్లు ఎంపికవుతాయి.

Tags

Next Story