PV Sindhu vs T.Y. Tai : సింధుపై అయిదేళ్ళ పగ.. ఇలా తీర్చుకుంది..!

పీవీ సింధు కల చెదిరింది. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టాలన్న కసితో బరిలోక్ దిగిన ఆమె.. తీవ్ర ఒత్తిడి లోనై సెమీఫైనల్లో పరాజయంపాలైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో.. చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజుయింగ్‌తో తలపడి 18-21, 12-21తో ఓటమి పాలైంది. క్వార్టర్‌ఫైనల్ వరకు అద్భుతంగా ఆడిన సింధు సెమీస్‌లో మాత్రం తడబడింది. అత్యుత్తమ క్రీడాకారిణిగా పేరున్న తైజుయింగ్ ముందు తేలిపోయింది. తొలిసెట్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగినప్పటికీ చివర్లో తైజు పుంజుకుంది.
ఇక రెండో సెట్‌లో మాత్రం సింధు పైన తైజుయింగ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దీనితో సింధుకి ఓటమి తప్పలేదు. టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్‌లో పీవీ సింధూను ఓడించి ఫైనల్‌కి చేరడమే కాకుండా తన అయిదేళ్ళ పగను తైజుయింగ్ ఈ విధంగా తీర్చుకున్నట్టుగా కూడా అయింది. రియో ఒలింపిక్స్‌లో సింధూ చేతిలో తైజూయింగ్ ఓడిపోయింది. ఇక తైజుయింగ్ చేతిలో సింధూకు ఇది 14 వ ఓటమి. ఇప్పటివరకు వీరిద్దరూ 19 సార్లు తలపడగా సింధు కేవలం 5 సార్లు మాత్రమే విజయం సాధించింది.
తన కేరీర్‌లో మెత్తం 559 మ్యాచ్‌ల్లో 407 గెలిచిన తైజుయింగ్.. ప్రపంచ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతోంది. కాగా తన ఫైనల్ మ్యాచ్‌ని చైనా షట్లర్ చెన్ యూ ఫెయ్‌తో తైజుయింగ్ పోటీపడనుంది. కాగా సింధుకు ఇంకా పతకంపై ఆశలు మిగిలే ఉన్నాయి. మరో సెమీస్‌లో ఓటమిపాలైన హి బింగ్జియావో క్రీడాకారిణితో కాంస్యం కోసం సింధు తలపడనుంది. అలా అయినా భారత్‌కు, సింధుకు ఘనత దక్కినట్టేననిచెప్పాలి. గత ఒలింపిక్స్‌లో రజతం.. ఈసారి కాంస్యం సాధించిన ప్లేయర్‌గా ఆమెకి గుర్తింపు దక్కుతుంది. ఈ మ్యాచ్ నేడు(ఆదివారం) సాయంత్రం జరగనుంది.
Also Read :
♦ pv sindhu : సింధు ఓటమిలో 'ఆ అరగంట'
♦ 'ఈరోజు నాది కాకుండా పోయింది' .. ఓటమిపై పీవీ సింధు..!
♦ గోపీచంద్ ను కాదని.. అందుకే ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నా : పీవీ సింధు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com