Captain Shubman Gill : వరుస సెంచరీలతో అదరగొడుతున్న టీమిండియా కెప్టెన్

భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుభ్‌మాన్ గిల్ బ్యాట్ గర్జించడం ప్రారంభించింది. శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయి ఉండవచ్చు, కానీ ఆటగాడిగా అతని ప్రదర్శన అద్వితీయం. ప్రస్తుతం తన కెప్టెన్సీలో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న గిల్, ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. ప్రారంభం నుంచి కూల్ గా ఆడిన గిల్, కేవలం 199 బంతుల్లోనే 11 బౌండరీలతో సెంచరీ సాధించాడు. గిల్ వరుసగా 2 ఫోర్లు కొట్టడం ద్వారా తన సెంచరీని పూర్తి చేసుకోవడం ప్రత్యేకం.
గిల్ కీలక ఇన్నింగ్స్..
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ తొలి రోజున, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు శుభారంభం దక్కలేదు. వరుసగా వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 125 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన గిల్, తనకు ఇచ్చిన బాధ్యతను చాలా చక్కగా నిర్వహించాడు, ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో రెండుసార్లు 50 పరుగుల మార్కును దాటాడు.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు ముందు లీడ్స్ టెస్ట్‌లో శుభ్‌మాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేసిన గిల్, తన ఇన్నింగ్స్‌లో 227 బంతులు ఎదుర్కొని 19 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. ఇప్పుడు గిల్ ఎడ్జ్‌బాస్టన్‌లో ఇలాంటి ప్రదర్శననే ఇచ్చాడు. ఇది గిల్ టెస్ట్ కెరీర్‌లో 7వ సెంచరీ, అంతర్జాతీయ క్రికెట్‌లో 16వ సెంచరీ.
కోహ్లీతో సమానం
ఈ సెంచరీతో శుభ్‌మాన్ గిల్ భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును కూడా సమం చేశాడు. నిజానికి, ఎడ్జ్‌బాస్టన్‌లో సెంచరీ చేసిన రెండవ భారత కెప్టెన్ గిల్. దీనికి ముందు, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. 2018లో ఎడ్జ్‌బాస్టన్‌లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com