TEAM INDIA: ఉత్కంఠ పోరులో భారత్ జయకేతనం

TEAM INDIA: ఉత్కంఠ పోరులో భారత్ జయకేతనం
X
తొలి వన్డేలో కివీస్‌పై భారత్ విజయం... మరోసారి కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్... చెలరేగిపోతున్న విరాట్ కోహ్లీ

న్యూ­జి­లాం­డ్‌­తో జరు­గు­తు­న్న మూడు వన్డేల సి­రీ­స్‌­లో భారత జట్టు అద్భు­త­మైన శు­భా­రం­భం చే­సిం­ది. తొలి వన్డే­లో చి­వ­రి వరకు ఉత్కంఠ రే­పిన పో­రు­లో, భా­ర­త్ నా­లు­గు వి­కె­ట్ల తే­డా­తో వి­జ­యా­న్ని అం­దు­కుం­ది. 300 పరు­గుల భారీ లక్ష్యా­న్ని ఛే­దిం­చా­ల్సిన పరి­స్థి­తి­లో­నూ భారత బ్యా­టిం­గ్ లై­న­ప్ ఒత్తి­డి­ని తట్టు­కు­ని ని­ల­బ­డిం­ది. ము­ఖ్యం­గా వి­రా­ట్ కో­హ్లి నే­తృ­త్వం­లో­ని మధ్య వరుస బ్యా­టిం­గ్, చి­వ­ర్లో కే­ఎ­ల్ రా­హు­ల్ – హర్షి­త్ రాణా చి­వ­ర్లో బ్యా­టు ఝు­ళి­పిం­చ­డం­తో భా­ర­త్‌­కు వి­జ­యం దక్కిం­ది. సి­రీ­స్‌­లో 1–0 ఆధి­క్యం సా­ధిం­చిన భా­ర­త్, రెం­డో వన్డే­కు మరింత ఆత్మ­వి­శ్వా­సం­తో సి­ద్ధ­మ­వు­తోం­ది.

మిచెల్ దూకుడు

టాస్ ఓడి ముం­దు­గా బ్యా­టిం­గ్ చే­సిన న్యూ­జి­లాం­డ్ మంచి ఆరం­భ­మే దక్కిం­ది. హె­న్రీ ని­కో­ల్స్, డె­వా­న్ కా­న్వే జా­గ్ర­త్త­గా ఆడు­తూ ఇన్నిం­గ్స్‌­ను ముం­దు­కు నడి­పిం­చా­రు. భారత బౌ­ల­ర్లు తొలి ఓవ­ర్ల­లో కట్టు­ది­ట్టం­గా బౌ­లిం­గ్ చే­య­డం­తో స్కో­రు వేగం తక్కు­వ­గా ఉన్న­ప్ప­టి­కీ, క్రీ­జు­లో కు­దు­రు­కు­న్న తర్వాత కి­వీ­స్ ఓపె­న­ర్లు బ్యా­ట్లు ఝళి­పిం­చా­రు. హె­న్రీ ని­కో­ల్స్ 62 పరు­గు­ల­తో కీలక ఇన్నిం­గ్స్ ఆడగా, కా­న్వే 56 పరు­గు­ల­తో అత­ని­కి చక్క­టి మద్ద­తి­చ్చా­డు. అయి­తే అస­లైన ఇన్నిం­గ్స్‌­ను ని­ల­బె­ట్టిం­ది డరె­ల్ మి­చె­ల్. భారత బౌ­ల­ర్లు వి­కె­ట్లు తీ­స్తు­న్నా, మరో ఎం­డ్‌­లో మి­చె­ల్ మా­త్రం స్కో­రు బో­ర్డు­ను పరు­గు­లు పె­ట్టిం­చా­డు. 71 బం­తు­ల్లో 84 పరు­గు­లు చే­సిన మి­చె­ల్, ఐదు ఫో­ర్లు, మూడు సి­క్స­ర్ల­తో భా­ర­త్‌­పై ఒత్తి­డి పెం­చా­డు. భారత బౌ­ల­ర్ల­లో సి­రా­జ్ రెం­డు వి­కె­ట్లు తీ­శా­డు. హర్షి­త్ రాణా, ప్ర­సి­ద్ధ్ కృ­ష్ణ తలా రెం­డు వి­కె­ట్లు సా­ధిం­చి­న­ప్ప­టి­కీ, చి­వ­రి ఓవ­ర్ల­లో ఎక్కువ పరు­గు­లు ఇచ్చా­రు. చి­వ­ర­కు న్యూ­జి­లాం­డ్ 50 ఓవ­ర్ల­లో 8 వి­కె­ట్ల­కు 300 పరు­గు­లు చే­సిం­ది.

కోహ్లి క్లాస్

300 పరు­గుల లక్ష్యం­తో బరి­లో­కి ది­గిన భా­ర­త­జ­ట్టు­కు ఆరం­భం నె­మ్మ­ది­గా­నే సా­గిం­ది. కైల్ జే­మీ­స­న్, ఫౌ­క్స్ కట్టు­ది­ట్ట­మైన బౌ­లిం­గ్‌­తో తొలి ఐదు ఓవ­ర్ల­లో కే­వ­లం 15 పరు­గు­ల­కే భా­ర­త్‌­ను పరి­మి­తం చే­శా­రు. అయి­తే ఆ తర్వాత రో­హి­త్ శర్మ కొ­న్ని దూ­కు­డు షా­ట్ల­తో స్కో­రు బో­ర్డు­ను కది­లిం­చా­డు. జే­మీ­స­న్ బౌ­లిం­గ్‌­లో సి­క్స­ర్, ఫోర్ కొ­ట్టిన రో­హి­త్ ఊపు­మీద ఉన్న సమ­యం­లో­నే అదే బౌ­ల­ర్ చే­తి­లో ఔట­య్యా­డు. ఆ తర్వాత క్రీ­జు­లో­కి వచ్చిన వి­రా­ట్ క్లా­స్ ఇన్నిం­గ్స్ తో ఆక­ట్టు­కు­న్నా­డు. మరో ఎం­డ్‌­లో గిల్ ఆచి­తూ­చి ఆడు­తూ భా­గ­స్వా­మ్యా­న్ని ని­ర్మిం­చా­డు. కో­హ్లి తొలి నుం­చే బౌం­డ­రీ­లు కొ­డు­తూ స్కో­రు వే­గా­న్ని పెం­చ­గా, గిల్ నె­మ్మ­ది­గా కానీ స్థి­రం­గా ముం­దు­కు సా­గా­డు. ఈ జోడీ రెం­డో వి­కె­ట్‌­కు 118 పరు­గుల కీలక భా­గ­స్వా­మ్యం నె­ల­కొ­ల్పిం­ది. కో­హ్లి అర్ధ­శ­త­కం పూ­ర్తి చే­సిన తర్వాత మరింత దూ­కు­డు­గా ఆడగా, గిల్ కూడా తన అర్ధ­శ­త­కా­న్ని అం­దు­కు­న్నా­డు. అయి­తే 56 పరు­గుల వద్ద గిల్ ఔట­వ­డం­తో భా­గ­స్వా­మ్యం ము­గి­సిం­ది. ఆ తర్వాత శ్రే­య­స్ అయ్య­ర్ క్రీ­జు­లో­కి వచ్చి ఆత్మ­వి­శ్వా­సం­తో బ్యా­టిం­గ్ చే­శా­డు. గాయం కా­ర­ణం­గా కొం­త­కా­లం ఆటకు దూ­ర­మైన శ్రే­య­స్, ఈ మ్యా­చ్‌­లో తన ఫా­మ్‌­ను చా­టా­డు. కో­హ్లి­తో కలి­సి మూడో వి­కె­ట్‌­కు 77 పరు­గు­లు జో­డిం­చి భా­ర­త్‌­ను వి­జ­యా­ని­కి చే­రువ చే­శా­డు. 39 ఓవ­ర్ల­కు భా­ర­త్ స్కో­రు 234/2. కో­హ్లి 93 పరు­గు­ల­తో సెం­చ­రీ­కి చే­రు­వ­య్యా­డు. సెం­చ­రీ లాం­ఛ­న­మే అను­కు­న్న సమ­యం­లో, జే­మీ­స­న్ బౌ­లిం­గ్‌­లో అన­వ­సర షా­ట్‌­కు ప్ర­య­త్నిం­చి కో­హ్లి ఔట­య్యా­డు.

Tags

Next Story