Shardul Thakur : ఆస్పత్రిలో చేరిన టీమ్ ఇండియా క్రికెటర్

Shardul Thakur : ఆస్పత్రిలో చేరిన టీమ్ ఇండియా క్రికెటర్
X

టీమ్ ఇండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. కాగా 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూనే నిన్న రెస్టాఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఆడారు. సర్ఫరాజ్ డబుల్ సెంచరీ చేసేందుకు శార్దూల్ (36 రన్స్) సహకారం అందించారు. ఇరానీ కప్‌ పోరులో రెస్టాఫ్‌ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్‌ మొదటి రోజు నుంచే అనారోగ్యంగా కనిపించాడు. అయినప్పటికీ, రెండో రోజు బుధవారం బ్యాటింగ్‌కు వచ్చి, సర్ఫరాజ్‌ ఖాన్‌తో కలిసి జట్టుకు ముఖ్యమైన స్కోరు చేయడంలో సహకరించాడు. 102 డిగ్రీల జ్వరంతో ఉన్నప్పటికీ, శార్దూల్‌ (36; 59 బంతుల్లో 4×4, 1×6) జట్టు కోసం తన భాగస్వామ్యాన్ని కొనసాగించాడు. మ్యాచ్‌ తర్వాత జ్వరం పెరగడంతో,ముంబయి జట్టు మేనేజ్‌మెంట్‌ అతడిని లఖ్‌నవూలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం శార్దూల్‌ ( వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ,మలేరియా,డెంగీ వంటి పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్టులు వచ్చిన తర్వాత మూడో రోజు అతడిని ఆడించాలా వద్దా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని ముంబయి జట్టు వర్గాలు తెలిపాయి.

Tags

Next Story