Team India : టీమిండియాకు బిగ్ షాక్.. అయ్యర్ కుడా దూరం

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు గాయాలపాలవుతున్నారు. ఇప్పటికే జడేజా, రాహల్ గాయాల కారణంగా ఆటకు దూరమయ్యారు. తాజాగా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) వెన్ను, గజ్జల్లో నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఇంగ్లండ్‌తో జరగబోయే మిగితా మూడు టెస్టులు అతడు ఆడే అవకాశం కనిపించడం లేదు.
అయ్యర్ తరచూ వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. గతేడాది సర్జరీ చేయించుకున్నాడు. విశాఖలో రెండో టెస్టు ముగిసిన తర్వాత గాయం తిరగబెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అయ్యర్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేశాడు. దాంతో చివరి మూడు మ్యాచ్‌లకు అతను బరిలోకి దిగడం కష్టమేనని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. 29 ఏండ్ల అయ్యర్ తొలి రెండు టెస్టుల్లో పెద్దగా రాణించలేకపోయాడు.
జరిగిన రెండు టెస్టు మ్యాచ్ లు నాలుగు ఇన్నింగ్స్ లు చూసుకుంటే .. అయ్యర్ 35, 13, 27, 29 స్కోర్లు మాత్రమే చేశాడు. దీంతో అయ్యర్ ను పక్కన పెట్టాలన్న విమర్శలు వచ్చాయి. కానీ స్పిన్‌ను బాగా ఆడే సామర్థ్వం, మిడిల్, లోయర్ ఆర్డర్‌లో సీనియర్ ప్లేయర్ కావడంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి సపోర్ట్ ఇస్తోంది. అయితే ఇప్పుడు వెన్నునొప్పి కారణంగా అతను మిగితా టెస్టులు ఆడటం కష్టంగానే కనిపిస్తుంది.
తొలి టెస్టులో ఓడినా రెండో టెస్టులో గెలిచి లెక్క సరి చేసిన టీమిండియా మూడో టెస్టుకు రెడీ అవుతుంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ రాజ్‌కోట్‌లో ఈ నెల 15న మొదలవనుంది. రెండో మ్యాచ్ తర్వాత తమ ఇండ్లకు వెళ్లిపోయిన టీమిండియా ప్లేయర్లు మూడో టెస్టు కోసం ఆదివారం రాజ్‌కోట్ చేరుకోనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com