TEAM INDIA: ఓటముల నుంచి పాఠాలు నేర్వని హెడ్ కోచ్

TEAM INDIA: ఓటముల నుంచి పాఠాలు నేర్వని హెడ్ కోచ్
X
హెడ్ కోచ్‌గా విఫలమవుతున్న గంభీర్... కోచ్ గంభీర్ కెరీర్‌లోనే మాయని మచ్చ... మొన్న న్యూజిలాండ్ సిరీస్ వైట్ వాష్

భా­ర­త్ వర్సె­స్ దక్షి­ణా­ఫ్రి­కా మధ్య జరి­గిన మొ­ద­టి టె­స్ట్ మ్యా­చ్ కే­వ­లం 3 రో­జు­లు మా­త్ర­మే పట్టిం­ది. దక్షి­ణా­ఫ్రి­కా భా­ర­త్‌­ను 30 పరు­గుల తే­డా­తో ఓడిం­చిం­ది. భారత బ్యా­ట్స్‌­మె­న్స్ 124 పరు­గుల స్వ­ల్ప లక్ష్యా­న్ని ఛే­దిం­చ­డం­లో వి­ఫ­ల­మ­య్యా­రు. దీం­తో ఈ ఓటమి భారత జట్టు­కు ఇబ్బం­ది­క­ర­మైన రి­కా­ర్డు­ను సృ­ష్టిం­చిం­ది. 124 పరు­గుల లక్ష్యా­న్ని ఛే­దిం­చిన భారత జట్టు కే­వ­లం 93 ​​­ప­రు­గు­ల­కే కు­ప్ప­కూ­లిం­ది. దక్షి­ణా­ఫ్రి­కా 15 సం­వ­త్స­రాల తర్వాత భారత జట్టు తన తొలి టె­స్ట్ వి­జ­యా­న్ని నమో­దు చే­య­డం ద్వా­రా చరి­త్ర­ను మా­ర్చిం­ది.

గంభీర్ చెత్త వ్యూహం

వైట్ బాల్ క్రి­కె­ట్‌­ను పక్కన పె­డి­తే, రెడ్ బాల్ ఫా­ర్మా­ట్‌­లో భారత జట్టు ఇటీ­వల కా­లం­లో తీ­వ్ర ఒడి­దు­డు­కు­లు ఎదు­ర్కొం­టోం­ది. గత ఏడా­ది దే­శీయ సి­రీ­స్‌­లో న్యూ­జి­లాం­డ్ చే­తి­లో చి­త్తు­గా ఓడిం­ది భా­ర­త్. తా­జా­గా కో­ల్‌­క­తా ఈడె­న్ గా­ర్డె­న్స్‌­లో సౌ­తా­ఫ్రి­కా భారత జట్టు­ను 30 పరు­గుల తే­డా­తో ఓడిం­చిం­ది. ఇది 15 ఏళ్ల తర్వాత సౌ­తా­ఫ్రి­కా భా­ర­త్‌­ను తమ గడ్డ­క­పై ఓడిం­చి ప్ర­త్యే­కత సా­ధిం­చిం­ది.టెం­బా బవు­మా నా­య­క­త్వం­లో­ని ఈ జట్టు, కీలక సం­ద­ర్భా­ల్లో మె­రు­గ్గా ఆడిం­ది. బ్యా­టిం­గ్ ఆర్డ­ర్ దె­బ్బ­కొ­ట్ట­డం, లె­ఫ్ట్ హ్యాం­డ్ బ్యా­ట­ర్ల వి­ఫ­లం కా­వ­డం, కె­ప్టె­న్ శుభ్ మన్ గిల్ గాయం వంటి కా­ర­ణా­లు భారత జట్టు పరా­జ­యా­ని­కి దారి తీ­శా­యి. భారత జట్టు­లో అను­భ­వ­జ్ఞు­లు, ఫు­ల్‌­టై­మ్ స్పె­ష­లి­స్ట్ బ్యా­ట­ర్లు ఉన్న­ప్ప­టి­కీ బ్యా­టిం­గ్ ఆర్డ­ర్‌­లో మా­ర్పు­ల­తో ప్ర­యో­గా­లు చే­య­డం జట్టు­ను దె­బ్బ­కొ­ట్టిం­ది. జట్టు మే­నే­జ్‌­మెం­ట్ వా­షిం­గ్ట­న్ సుం­ద­ర్‌­ను మూడు నం­బ­ర్‌­కు పంపే ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. సుం­ద­ర్ పో­రా­డి తొలి ఇన్నిం­గ్స్‌­లో 29 పరు­గు­లు, రెం­డో ఇన్నిం­గ్స్‌­లో 31 పరు­గు­లు సా­ధిం­చా­డు.

మరీ ఇంత తికమక ఎందుకు.?

సౌ­తా­ఫ్రి­కా­తో తొలి టె­స్టు మ్యా­చ్ కు ఫై­న­‌­ల్ లె­వ­‌­న్ ను చూసి చాలా మంది మా­జీ­లు కూడా ఆశ్చ­‌­ర్యం వ్య­‌­క్తం చే­శా­రు! ఇదేం జ‌­ట్టు కూ­ర్పు అంటూ .. ని­వ్వె­ర­‌­పో­యా­రు! వారి ఆశ్చ­‌­ర్యా­ని­కి త‌­గ్గ­‌­ట్టు­గా­నే ఫ‌­లి­తం వ‌­చ్చిం­ది! అస­‌­లు వా­షిం­గ్ట­‌­న్ సుం­ద­‌­ర్ ను మూడో స్థా­నం­లో పం­పా­ల­‌­నే ఆలో­చ­‌­న­‌­కు హ్యా­ట్సా­ఫ్ చె­ప్పా­లి! వా­షిం­గ్ట­‌­న్ సుం­ద­‌­ర్, ర‌­వీం­ద్ర జ‌­డే­జా, అక్ష­‌­ర్ ప‌­టే­ల్.. ఇలా ఆల్ రౌం­డ­‌­ర్లు ఎక్కు­వై­పో­యి.. అటు బ్యా­టిం­గ్ లోనూ ఇటు బౌ­లిం­గ్ లో కూడా తేడా కొ­డు­తోం­ది! ఇద్ద­‌­రు స్పి­న్న­‌­ర్ల­తో.. టీ­మిం­డి­యా స్వ­దే­శం­లో బో­లె­డ­‌­న్ని టె­స్టు మ్యా­చ్ ల‌ను నె­గ్గిం­ది! అయి­తే ఇప్పు­డు ము­గ్గు­రు స్పి­న్న­‌­ర్ల­‌­ను జ‌­ట్టు­లో కూ­ర్చు­కు­న్నా.. వ‌­ర­‌స ఓట­‌­ము­లు త‌­ప్ప­‌­డం లేదు! ఇక పిచ్ ల ప‌­రి­స్థి­తి మ‌­రింత ద‌­య­‌­నీ­యం­గా త‌­యా­రైం­ది. స‌­రి­గ్గా కో­వి­డ్ స‌­మ­‌­యం నుం­చి ఇం­డి­యా పిచ్ ల ప‌­రి­స్థి­తి అత్యంత చె­త్త­‌­గా మా­రిం­ది. గ‌త నా­లు­గై­దే­ళ్ల­‌­లో పో­టా­పో­టీ ప‌­రి­స్థి­తు­ల్లో ఐదో రోజు వ‌­ర­‌­కూ జ‌­రి­గిన టె­స్టు ఒక్క­‌­టం­టే ఒక్క­‌­టి లే­దం­టే.. ఈ పిచ్ లు టె­స్టు క్రి­కె­ట్ ను చం­పే­య­‌­డా­ని­కే అని వేరే చె­ప్ప­‌­న­‌­క్క­‌­ర్లే­దు! మ‌రి అలాం­టి పిచ్ ల‌ను త‌­యా­రు చే­సు­కు­ని నె­గ్గ­‌­నై­నా నె­గ్గు­తు­న్నా­రా.. అంటే, త‌ను తీ­సు­కు­న్న గో­తి­లో త‌నే ప‌­డ్డ­‌­ట్టు­గా ఉంది టీ­మిం­డి­యా ప‌­రి­స్థి­తి! రుడు న్యూ­జి­లాం­డ్‌­ను, ఇప్పు­డు దక్షి­ణా­ఫ్రి­కా­ను భా­ర­త్‌­కు తే­లి­గ్గా తీ­సు­కుం­ది. కి­వీ­స్‌ అను­భ­వం తర్వాత కూడా భా­ర­త్‌.. సఫా­రీ స్పి­న్న­ర్ల నుం­చి ఎదు­ర­య్యే ము­ప్పు­ను గ్ర­హిం­చ­లే­క­పో­యిం­ది. ఈ తప్పు­ను కోచ్ గం­భీ­ర్ అం­చ­నా వే­య­లే­క­పో­యా­డు.

Tags

Next Story