TEAM INDIA: భీమవరం వాసికి అరుదైన గుర్తింపు

TEAM INDIA: భీమవరం వాసికి అరుదైన గుర్తింపు
X
టీమిండియా మేనేజర్‌గా పీవీఆర్ ప్రశాంత్‌... భీమవరం ఎమ్మెల్యే కుమారుడే ప్రశాంత్

భారత క్రి­కె­ట్ జట్టు­లో తె­లు­గు వ్య­క్తి­కి కీలక బా­ధ్యత లభిం­చిం­ది. ఆం­ధ్రా క్రి­కె­ట్ అసో­సి­యే­ష­న్ (ఏసీఏ) మాజీ ఉపా­ధ్య­క్షు­డు, భీ­మ­వ­రా­ని­కి చెం­దిన పీ­వీ­ఆ­ర్ ప్ర­శాం­త్‌­ను టీ­మిం­డి­యా మే­నే­జ­ర్‌­గా ని­య­మిం­చా­రు. త్వ­ర­లో జర­గ­ను­న్న ఆసి­యా కప్ టీ20 టో­ర్న­మెం­ట్‌­కు ఆయన భారత జట్టు­కు మే­నే­జ­ర్‌­గా వ్య­వ­హ­రిం­చ­ను­న్నా­రు. ఈ అరు­దైన గౌ­ర­వం దక్కిం­చు­కు­న్న ప్ర­శాం­త్, గతం­లో పశ్చి­మ­గో­దా­వ­రి జి­ల్లా క్రి­కె­ట్ జట్టు­కు ఆట­గా­డి­గా ప్రా­తి­ని­ధ్యం వహిం­చా­రు. సె­ప్టెం­బ­ర్ 9 నుం­చి 28 వరకు దు­బా­య్, అబు­దా­బి వే­ది­క­లు­గా ఈ మెగా టో­ర్న­మెం­ట్ జర­గ­నుం­ది. ఈ టో­ర్నీ­లో భా­ర­త్, పా­కి­స్థా­న్, శ్రీ­లంక, ఆఫ్ఘ­‌­ని­స్థా­న్, బం­గ్లా­దే­శ్‌­తో పాటు హాం­కాం­గ్, ఒమన్, యూఏఈ జట్లు పా­ల్గొ­న­ను­న్నా­యి. ఈ కీలక టో­ర్న­మెం­ట్‌­లో జట్టు మే­నే­జ్‌­మెం­ట్ బా­ధ్య­త­ల­ను ప్ర­శాం­త్ పర్య­వే­క్షిం­చ­ను­న్నా­రు. ప్ర­శాం­త్ రా­జ­కీ­యం­గా కూడా సు­ప­రి­చి­త­మైన కు­టుం­బా­ని­కి చెం­ది­న­వా­రు. ఆయన భీ­మ­వ­రం ఎమ్మె­ల్యే, పీ­ఏ­సీ ఛై­ర్మ­న్ అయిన పు­ల­ప­ర్తి రా­మాం­జ­నే­యు­లు కు­మా­రు­డు. అం­తే­కా­కుం­డా, భీ­మి­లి ఎమ్మె­ల్యే గంటా శ్రీ­ని­వా­స­రా­వు­కు స్వ­యా­నా అల్లు­డు.

1997 తర్వాత ఇదే

భారత క్రి­కె­ట్ జట్టు­కు మే­నే­జ­ర్‌­గా తె­లు­గు వ్య­క్తి ఎం­పి­క­వ్వ­డం ఇది రెం­డో­సా­రి. గతం­లో 1997లో వె­స్టిం­డీ­స్ పర్య­టన సం­ద­ర్భం­గా వి­శా­ఖ­‌­ప­‌­ట్నం మాజీ మే­య­ర్ డీవీ సు­బ్బా­రా­వు టీ­మిం­డి­యా­కు అడ్మి­ని­స్ట్రే­టి­వ్ మే­నే­జ­ర్‌­గా సే­వ­లు అం­దిం­చా­రు. చాలా సం­వ­త్స­రాల తర్వాత మళ్లీ ఇప్పు­డు ప్ర­శాం­త్‌­కు ఈ అవ­కా­శం దక్క­డం వి­శే­షం. గతంలో 1983లో వరల్డ్ కప్ విజయం సాధించిన సమయంలో టీమిండియా మేనేజర్ గా తెలుగు వ్యక్తి ఉండటం విశేషం. టీమిండియా మేనేజర్ గా తెలుగు వ్యక్తి ఉన్నారు. అతడి పేరు పి.ఆర్.మాన్ సింగ్. 1983 ప్ర­పంచ కప్ గె­లి­చిన భారత జట్టు­కు మే­నే­జ­ర్ గా వ్య­వ­హ­రిం­చా­రు. పీ.ఆర్. మాన్ సిం­గ్ 1938 నవం­బ­ర్ 24న జన్మిం­చా­రు. అతను ఒక మాజీ క్రి­కె­ట­ర్. 1987 క్రి­కె­ట్ ప్ర­పంచ కప్‌­లో సెమీ-ఫై­న­ల్‌­కు చే­రు­కు­న్న భారత జట్టు­ను కూడా ని­ర్వ­హిం­చా­రు. ఆ తర్వాత హై­ద­రా­బా­ద్ క్రి­కె­ట్ సం­ఘా­ని­కి కా­ర్య­ద­ర్శి­గా కూడా పని­చే­శా­రు. తె­లు­గు వ్య­క్తు­లు టీ­మిం­డి­యా మే­నే­జ­ర్లు­గా వ్య­వ­హ­రి­స్తే.. టీ­మిం­డి­యా వి­జ­యం సా­ధి­స్తుం­ద­నే ఓ సెం­టి­మెం­ట్ కూడా ఉం­ద­ని సో­ష­ల్ మీ­డి­యా­లో ట్రెం­డ్ కా­వ­డం వి­శే­షం. మరో­వై­పు 1997 వె­స్టిం­డీ­స్ పర్య­ట­న­లోో భారత జట్టు­కు అడ్మి­ని­స్ట్రే­టి­వ్ మే­నే­జ­ర్ గా డీవీ సు­బ్బా­రా­వు వ్య­వ­హ­రిం­చా­రు. దా­దా­పు 28 సం­వ­త్స­రాల తరు­వాత ఆం­ధ్రా ప్రాం­తా­ని­కి చెం­దిన ఓ వ్య­క్తి­కి అవ­కా­శం దక్క­డం వి­శే­షం.

సెప్టెంబర్ 28న ఆసియా కప్ ఫైనల్

యూఏఈలో సెప్టెంబర్ 09న ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరుగనుంది. అప్గానిస్తాన్, హాంకాంగ్ పోరుతో టోర్నీ ప్రారంభం కానుంది. భారత్ తన మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఇక ఈ టోర్నీ కోసం 15 మందితో కూడిన భారత జట్టును సెలక్షన్ కమిటీ ఇటీవలే ప్రకటించింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, వైస్ కెప్టెన్ గా శుబ్ మన్ గిల్ ఎంపికయ్యారు. మరోవైపు సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేశారు. అలాగే గాయంతో జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో జితేష్ శర్మ వికెట్ కీపింగ్ బాధ్యతలను నిర్వహించనున్నాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ బాధ్యతలను పంచుకోబోతున్నారు. భారత్-పాక్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

Tags

Next Story