KOHLI: రంజీ ట్రోఫీకి నిరాకరించిన కోహ్లీ..!

KOHLI: రంజీ ట్రోఫీకి నిరాకరించిన కోహ్లీ..!
X
అదే బాటలో కేఎల్‌ రాహుల్.. ఛాంపియన్స్‌ ట్రోఫీపైనే అందరి దృష్టి

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రంజి ట్రోఫీ సిరీస్‌లో పాల్గొనేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. తాను రంజీలు ఆడలేనని కోహ్లీ బీసీసీఐ యాజమాన్యానికి తెలిపారు. దీనికి కారణం ఆయన మెడనొప్పితో బాధపడటమేనని తెలుస్తోంది. అలాగే KL రాహుల్ కూడా ఇందులో పాల్గొనేందుకు నిరాకరించారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అనారోగ్య కారణాల వల్ల అంతర్జాతీయ ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా ఉండొచ్చు.

కరుణ్‌‌ను స్టాండ్‌బైగా తీసుకోవాల్సింది: హర్భజన్

ఇంగ్లాండ్‌పై ట్రిపుల్ సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించిన కరుణ్ నాయర్‌.. ఆ తర్వాత 8ఏళ్లు కనమరుగైపోయాడు. అయితే, ఈ ఏడాది దేశవాలి టోర్నీలో 5 శతకాలతో 600కు పైగా పరుగులు చేశాడు. దీంతో నాయర్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేస్తారనుకున్నారు కానీ నాయర్‌కు చోటు దక్కలేదు. దీనిపై హర్భజన్ సింగ్ స్పందించాడు. కరుణ్‌ నాయర్‌ను కనీసం స్టాండ్‌బైగా అయినా తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు.

రోహిత్‌ మళ్లీ దంచికొడతాడు: సురేశ్ రైనా

2019 WC మాదిరిగా ఛాంపియన్స్‌ ట్రోఫీలో రోహిత్ శర్మ దంచికొడతాడని భారత మాజీ ఆటగాడు సురేశ్ రైనా ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మేం చివరగా (2013) ఇంగ్లాండ్‌లో CT గెలిచాం. అయితే, ప్రస్తుతం దుబాయ్‌ వేదికగా భారత్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్కడి పరిస్థితులు ఇంగ్లాండ్‌ కంటే భిన్నంగా ఉంటాయి. యూఏఈలో ఎలా ఆడాలో రోహిత్‌కు తెలుసు. అతను 20-25 ఓవర్ల వరకు ఆడితే 2019 WC ప్రదర్శన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని పేర్కొన్నారు.

'సంజు కెరియర్‌ నాశనం చేస్తున్నారు'

రాజకీయాలతో టీమిండియా యంగ్ ప్లేయర్ సంజు శాంసన్‌ కెరియర్‌ను నాశనం చేస్తున్నారని కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌పై ఎంపీ శశిథరూర్‌ మండిపడ్డారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీల మధ్య జరిగిన శిక్షణా శిబిరానికి హాజరు కాలేకపోయిన విషయాన్ని శాంసన్‌ ఇప్పటికే KCAకి లేఖ ద్వారా వివరించారు. అయినా అతన్ని కేరళ జట్టు నుంచి తొలగించారని, ఈ కారణంతోనే జాతీయ జట్టు నుంచి కూడా తొలగించారని శశిథరూర్ విమర్శించారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూవీ తండ్రి

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 కోసం బీసీసీఐ టీం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మ్యాచ్‌ కోసం టీం ప్రయాణిస్తున్నపుడు వారి భార్యలు, పిల్లలు ఉండాల్సిన అవసరం ఏంటి? రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత వారితో కావాల్సినంత సమయం గడపవచ్చు. కానీ, దేశం కోసం ఆడేటప్పుడు వీరంతా అదనపు భారమే అవుతారు' అని అన్నారు.

Tags

Next Story