VHT: దేశవాళీలో చెలరేగుతున్న టీమిండియా స్టార్లు

దేశవాళీ ట్రోఫీలో టీమిండియా స్టార్లు చెలరేగుతున్నారు.వరుస శతకాలతో సెలెక్టర్లకు పెద్ద తలొనొప్పిగా మారారు. కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు అదరగొడుతున్నారు. మొన్నటి వరకు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేల్లో చెలరేగిపోయి ఆడారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ 2025 టోర్నమెంటులో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. నిన్న ప్రారంభమైన ఈ టోర్నమెంటులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగిపోయారు. వీళ్ళు సెంచరీ చేయడమే కాకుండా తమ జట్లను విజయతీరాలకు చేర్చుతున్నారు. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్ లో ROKO రంగంలోకి దిగుతారని పోస్టులు పెడుతున్నారు.
స్టార్లతో కళకళ
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోపాటు భారత ఆటగాళ్లు పలువురు బరిలోకి దిగనుండడంతో విజయ్ హజారే ట్రోఫీలో సరికొత్త సందడి నెలకొంది. బుధవారం నుంచి టోర్నీ జరగనుంది. రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ కూడా తమతమ జట్ల తరఫున బరిలోకి దిగుతున్నా.. అభిమానుల దృష్టి మాత్రం కోహ్లీ, రోహిత్‌పైనే ఉంది. బీసీసీఐ ఆదేశాల నేపథ్యంలో 15 ఏళ్ల తర్వాత విరాట్ ఈ దేశవాళీ టోర్నీలో ఆడుతున్నాడు. ముంబై తరఫున రోహిత్ కేవలం రెండు మ్యాచ్‌లు అంటే.. ఈ నెల 24న సిక్కింతో, 26న ఉత్తరాఖండ్‌తో ఆడనున్నాడు. కోహ్లీ.. ఢిల్లీ తరఫున ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడనే దానిపై స్పష్టత లేదు. గ్రూప్-డిలో తొలి మ్యాచ్‌లో ఆంధ్రతో ఢిల్లీ తలపడనుంది. ఇక, గ్రూప్-బిలో రాజ్‌కోట్‌లో జరిగే మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌తో హైదరాబాద్ ఆడనుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి సూపర్ స్టార్లకు తోడు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ లాంటి టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఈ టోర్నీలో బరిలోకి దిగబోతున్నారు. స్టార్ ఆటగాళ్ల రాకతో యువ ఆటగాళ్లకు మార్గదర్శనంగా ఉండనుంది. కోహ్లీ, రోహిత్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
తప్పనిసరి చేసిన బీసీసీఐ
టీమ్‌ఇండియా మ్యాచ్‌లు లేని సమయంలో దేశవాళీ టోర్నీలు జరిగితే.. భారత ఆటగాళ్లందరూ వాటిలో ఆడడాన్ని బీసీసీఐ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. రోహిత్, కోహ్లి, రాహుల్ గత నెల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో బరిలోకి దిగారు. పంత్ అంతకుముందు అదే జట్టుతో టెస్టు సిరీస్ ఆడాడు. శుభ్‌మన్, సూర్య, అభిషేక్ ఇటీవలే టీ20 సిరీస్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. వీళ్లంతా వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడనున్నారు. ఈ లోపు టీమ్‌ఇండియా ఆటగాళ్లందరినీ విజయ్ హజారే టోర్నీలో ఆడాలని బీసీసీఐ ఆదేశించింది. బుధవారం మొదలయ్యే టోర్నీలో బెంగళూరులో ఆంధ్రతో మ్యాచ్‌లో కోహ్లి దిల్లీ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్‌లో పంత్ దిల్లీకి నాయకత్వం వహించనుండగా.. ఆంధ్రను ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి నడిపించనున్నాడు. టీమ్‌ఇండియా పేసర్ హర్షిత్ రాణా కూడా దిల్లీ జట్టులో ఉన్నాడు. మరోవైపు జైపుర్‌లో సిక్కింతో జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ముంబయికి ఆడనున్నాడు. శార్దూల్ ఠాకూర్ సారథ్యంలో హిట్‌మ్యాన్ ఆడనున్నాడు. సూర్యకుమార్ టోర్నీ కోసం ముంబయి జట్టుకు అందుబాటులో ఉన్నప్పటికీ.. తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగకపోవచ్చు. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. మహారాష్ట్రతో మ్యాచ్‌లో పంజాబ్‌కు ఆడనున్నాడు. మరో మ్యాచ్‌లో కర్ణాటకతో కేరళ తలపడనునండగా.. కేఎల్ రాహుల్, సంజు శాంసన్ ప్రత్యర్థులుగా ఆడబోతున్నారు. అన్ని మ్యాచ్‌లూ ఉదయం 9కే ఆరంభమవుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

