TEAM INDIA: విశ్వ సమరానికి సూర్య సారథ్యంలోనే..

2026 ఫిబ్రవరిలో జరగబోయే ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఆడబోయే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఆడనుంది భారత జట్టు... ఊహించని విధంగా ఆస్ట్రేలియాతో T20 సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన శుభ్‌మన్ గిల్, వరల్డ్ కప్‌కి ముందు టీమ్ నుంచి తప్పించబడ్డాడు. దీంతో అతనికి టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కలేదు. టీ20 సెటప్‌లో గిల్ సెట్ కావడం లేదని అనేక విమర్శలు రావడం, వరుసగా విఫలం కావడం, ఆఖరి టీ20లో టీమ్‌లోకి వచ్చిన సంజూ శాంసన్ చక్కగా రాణించడంతో అతన్ని తప్పించబడానికి బీసీసీఐ పెద్దగా కారణాలు అవసరం రాలేదు.
అక్షర్ పటేల్‌కు ప్రమోషన్
అక్షర్ పటేల్‌కి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కింది. అలాగే దేశవాళీ టోర్నీల్లో అత్యద్భుత ప్రదర్శన ఇస్తూ, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ గెలిచిన ఇషాన్ కిషన్... రెండేళ్ల తర్వాత భారత జట్టులో చటు దక్కించుకున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెం.1 పొజిషన్లో ఉన్న అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనింగ్ చేస్తాడు. మూడో స్థానంలో తిలక్ వర్మ, నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కి వస్తారు. మిడిల్ ఆర్డర్లో హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్.. ఆ తర్వాత అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా.. ఇలా టీమ్ చూడడానికి పటిష్టంగా కనిపిస్తోంది.
జైస్వాల్‌కు దక్కని స్థానం
శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్సీతోపాటు జట్టులో చోటు కోల్పోయాడు. యశస్వి జైస్వాల్ ఎంపిక కాలేదు. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ అనూహ్యంగా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అతడు ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించిన విషయం తెలిసిందే. దీంతో సెలక్టర్లు ఇషాన్ వైపు మొగ్గు చూపారు. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. వరల్డ్‌కప్ మ్యాచ్‌లు 7 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. రత్ గ్రూప్ స్టేజిలో తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న యూఎస్ఏతో ఆడనుంది. ఫిబ్రవరి 12న మ్యాచ్ నమీబియాతో జరగనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా టీమ్ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో పోటీ పడనుంది. ఫిబ్రవరి 21 నుంచి, మార్చి 1 వరకు సూపర్ 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 4న మొదటి సెమీఫైనల్, మార్చి 5న రెండో సెమీఫైనల్ జరగనుంది. అలాగే టీ20 వరల్డ్ కప్‌నకు ముందు, జనవరి 11 నుంచి న్యూజిలాండ్.. భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, 5 టీ20లు జరగనున్నాయి. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టే ఆడనుంది.
భారత జట్టు ఇదే..:
అభిషేక్ శర్మ, సూర్యకుమార్ (కెప్టెన్), సంజుశాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్ ( వైస్ కెప్టెన్), రింకు సింగ్, బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

