TEAM INDIA: ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా

TEAM INDIA: ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా
X
రోహిత్ -విరాట్‌ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. అక్టోబర్ 19 నుంచి ఆసీస్ - భారత్ వన్డే సిరీస్... అక్టోబర్ 19వ తేదీన పెర్త్‌లో తొలి వన్డే

టీ­మిం­డి­యా ప్లే­య­ర్లు ఆస్ట్రే­లి­యా­లో అడు­గు­పె­ట్టా­రు. ప్లే­య­ర్ల­కు వీ­డ్కో­లు పలి­కేం­దు­కు అభి­మా­ను­లు ఎయి­ర్‌­పో­ర్టుల వద్ద కో­లా­హ­లం చే­శా­రు. ము­ఖ్యం­గా రో­హి­త్ శర్మ , వి­రా­ట్ కో­హ్లిల కోసం ఫ్యా­న్స్ ఎగ­బ­డ్డా­రు. ఛాం­పి­య­న్స్ ట్రో­ఫీ తర్వాత ఈ ఇద్ద­రు లె­జెం­డ్రీ ఆట­గా­ళ్లు మళ్లీ భారత జె­ర్సీ­లో కని­పిం­చ­నుం­ది ఆసీ­స్ సి­రీ­స్‌­తో­నే. ఆస్ట్రే­లి­యా­తో మూడు వన్డేల సి­రీ­స్ కోసం భారత క్రి­కె­ట్ జట్టు స్క్వా­డ్ బు­ధ­వా­రం ఉదయం పయ­న­మైం­ది. అక్టో­బ­ర్ 19 నుం­చి ఈ వన్డే సి­రీ­స్ ప్రా­రం­భం కా­నుం­డ­గా.. మొ­ద­టి వన్డే పె­ర్త్ వే­ది­క­గా జర­గ­నుం­ది. ఐసీ­సీ వన్డే వర­ల్డ్ కప్ 2027 నే­ప­థ్యం­లో సె­ల­క్ట్ చే­సిన ఈ జట్టు­కు ఈ సి­రీ­స్ ఎంతో కీ­ల­కం కా­నుం­ది. ము­ఖ్యం­గా సీ­ని­య­ర్ బ్యా­ట­ర్లు రో­హి­త్ శర్మ, వి­రా­ట్ కో­హ్లి భవి­త­వ్యం కూడా ఈ సి­రీ­స్‌­లో­నే తే­ల­నుం­ది. ఛాం­పి­య­న్స్ ట్రో­ఫీ 2025లో వి­జే­త­గా ని­లి­చిన తర్వాత టీ­మిం­డి­యా స్టా­ర్ బ్యా­ట­ర్లు రో­హి­త్ శర్మ, వి­రా­ట్ కో­హ్లి టె­స్టు క్రి­కె­ట్‌­కు రి­టై­ర్మెం­ట్ ప్ర­క­టిం­చా­రు. బీ­సీ­సీఐ ఒత్తి­ళ్ల­తో రో­హి­త్ గుడ్ బై చె­ప్ప­గా, కో­హ్లి మా­త్రం రో­హి­త్‌­ను అను­స­రి­స్తూ రి­టై­ర్మెం­ట్ ఇచ్చా­డు. ఈ ఇద్ద­రు ఆట­గా­ళ్ల రి­టై­ర్మెం­ట్ వి­ష­యం­లో తమ పా­త్ర లే­ద­ని బీ­సీ­సీఐ చె­బు­తు­న్నా.. క్రి­కె­ట్ వి­శ్లే­ష­కు­లు మా­త్రం కోచ్ గం­భీ­ర్, సె­ల­క్ట­ర్ అజి­త్ అగా­ర్క­ర్ ఒత్తి­ళ్ల­తో­నే వారు రి­టై­ర్మెం­ట్ ఇచ్చి­న­ట్లు చె­బు­తు­న్నా­రు.

టీమిండియాకు బిగ్ షాక్!

టీ­మిం­డి­యా ఆల్‌­రౌం­డ­ర్ శి­వ­మ్ దూబే గాయం కా­వ­డం­తో క్రి­కె­ట్ ఫ్యా­న్స్‌­తో ఆం­దో­ళన వ్య­క్త­మ­వు­తుం­ది. అక్టో­బ­ర్ 19 నుం­చి ప్రా­రం­భం కా­ను­న్న టీ20 సి­రీ­స్‌­కు కొ­న్ని రో­జుల ముం­దు ఈ స్టా­ర్ ఆట­గా­డు గా­యం­తో ఇబ్బం­ది పడటం.. జట్టు వ్యూ­హా­ల­పై ప్ర­భా­వం చూపే అవ­కా­శం ఉంది. శి­వ­మ్ దూబే వె­న్ను నొ­ప్పి సమ­స్య­తో బా­ధ­ప­డు­తు­న్నా­డ­ని సమా­చా­రం. రంజీ ట్రో­ఫీ 2025లో భా­గం­గా ముం­బై జట్టు జమ్మూ కా­శ్మీ­ర్‌­తో శ్రీ­న­గ­ర్‌­లో ఆడే తొలి మ్యా­చ్‌­కు కూడా శి­వ­మ్ దూబే అం­దు­బా­టు ఉం­డ­టం లేదు. వా­స్త­వా­ని­కి రంజీ మ్యా­చ్ కోసం ముం­బై జట్టు­తో కలి­సి దూబే శ్రీ­న­గ­ర్‌­కు వె­ళ్లా­డు. అయి­తే అక్క­డి తీ­వ్ర­మైన చల్ల­ని వా­తా­వ­ర­ణం దూబే వె­న్ను­నొ­ప్పి వచ్చి­న­ట్లు తె­లు­స్తోం­ది.

ఆస్ట్రేలియాకు డబుల్ షాక్!

ఆస్ట్రే­లి­యా­కు చెం­దిన ఇద్ద­రు స్టా­ర్ ప్లే­య­ర్లు భా­ర­త్‌­తో జర­గ­బో­యే తొలి వన్డే­కు దూ­ర­మ­య్యా­రు. ఆసీ­స్ లెగ్ స్పి­న్న­ర్ ఆడమ్ జంపా, వి­కె­ట్ కీ­ప­ర్ జోష్ ఇం­గ్లి­స్ మొ­ద­టి వన్డే మ్యా­చ్ కు అం­దు­బా­టు­లో ఉం­డ­డం లేదు. ఆడమ్ జంపా, జోష్ ఇం­గ్లి­ష్ స్థా­నం­లో మా­థ్యూ కు­హ్నె­మా­న్, జోష్ ఫి­లి­ప్‌­ల­ను జట్టు­లో­కి తీ­సు­కు­న్నా­రు. అయి­తే జోష్ ఫి­లి­ప్ మొ­ద­టి­సా­రి వన్డే­ల­లో వి­కె­ట్ కీ­పిం­గ్ చే­య­ను­న్నా­డు. . జంపా తం­డ్రి కా­ను­న్నా­డు. అతడి భా­ర్య త్వ­ర­లో బి­డ్డ­కు జన్మ­ని­వ్వ­బో­తోం­ది. ఈ క్ర­మం­లో­నే అతడు తొలి వన్డే­కు అం­దు­బా­టు­లో ఉం­డ­డం లేదు. అయి­తే అతను సి­రీ­స్‌­లో­ని చి­వ­రి రెం­డు వన్డే­ల­కు అం­దు­బా­టు­లో ఉం­టా­డ­ని క్రి­కె­ట్ ని­పు­ణు­లు భా­వి­స్తు­న్నా­రు.

Tags

Next Story