TEAM INDIA: మరింత దిగజారిన టీమిండియా

మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, టెస్టు కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత భారత జట్టు టెస్టు టాప్ ర్యాంక్ పోయింది. స్వదేశంలో టెస్టుల్లో ఉన్న ట్రాక్ రికార్డు పోయింది. విరాట్ కెప్టెన్సీలో వరుసగా రెండు సార్లు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కి అర్హత సాధించిన టీమిండియా... రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఆడిన 2023-25 పూర్తి సీజన్లో ఫైనల్‌కి చేరలేకపోయింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న 2025-27 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సీజన్లో భారత జట్టు, ఫైనల్లో చేరే అవకాశాలు కనిపించడం లేదు. తాజా డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఏకంగా ఆరో స్థానానికి పడిపోయింది. స్వదేశంలో సౌతాఫ్రికా చేతుల్లో క్లీన్ స్వీప్ అయిన భారత జట్టు, ఇంగ్లాండ్ టూర్లో టెస్టు సిరీస్‌ని డ్రా చేసుకుంది. ఈ సీజన్ల 48.15 శాతం విజయాలతో భారత జట్టు, WTC పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంటే.. పాకిస్తాన్ 50 శాతం విజయాలతో టప్ 5లో ఉంది..
యాషెస్ సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన ఆస్ట్రేలియా, టాప్‌లో కొనసాగుతుంటే సౌతాఫ్రికా 75 శాతం విజయాలతో టాప్ 2లో ఉంది. న్యూజిలాండ్, శ్రీలంక జట్లు 66.67 శాతం విజయాలతో 3, 4 స్థానాల్లో ఉన్నాయి. భారత్ చేతుల్లో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా చేతుల్లో 2 టెస్టులు ఓడిన ఇంగ్లాండ్ జట్టు, ప్రస్తుతం ఏడో పొజిషన్లో ఉంది..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే మిగిలిన 9 టెస్టుల్లో కనీసం 7 మ్యాచులు గెలవాల్సి ఉంటుంది.. మరో 8 నెలల పాటు వైట్ బాల్ క్రికెట్‌తో బిజీగా ఉండనుంది భారత జట్టు. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసే వరకూ టెస్టు మ్యాచులు లేవు. 2026 ఆగస్టులో శ్రీలంకతో శ్రీలంకతో రెండు టెస్టులు ఆడుతుంది భారత జట్టు..
లంకను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదనుకోవచ్చు, కానీ ఇండియాని ఇండియాలో 3-0 తేడాతో చిత్తు చేసిన న్యూజిలాండ్ జట్టు, శ్రీలంక చేతుల్లో టెస్టు సిరీస్ 2-0 తేడాతో ఓడిపోయి.. ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఇప్పుడున్న టీమ్‌కి లంకని ఓడించడం కూడా చాలా పెద్ద టాస్క్‌గా మారనుంది. అక్టోబర్ 2026లో న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌తో 2 టెస్టులు ఆడనుంది భారత జట్టు. న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌ని ఓడించడం అంటే ఆస్ట్రేలియాలో ఆసీస్‌ని ఓడించడం కంటే కష్టమైన పని. అక్కడి పిచ్‌లపై మనవాళ్లు పూర్తిగా తేలిపోతారు. కాబట్టి ఈ సిరీస్‌పై నమ్మకం పెట్టుకోవడం కూడా అత్యాశే అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

