TEAM INDIA: దక్షిణాఫ్రికా కోచ్‌కు ఇచ్చి పడేసిన టీమిండియా

భారత గడ్డపై 25 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇప్పటికే ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 టైటిల్ గెలిచిన బవుమాకు.. భారత పర్యటన రూపంలో ఈ మేరకు మరో అపురూపమైన విజయం దక్కింది. అయితే ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆట తర్వాత దక్షిణాఫ్రికా హెడ్‌కోచ్ షుక్రి కాన్రాడ్.. టీమిండియాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాము కావాలనే రెండో ఇన్నింగ్స్‌ను ఆలస్యంగా డిక్లేర్డ్ చేశామని షుక్రి కాన్రాడ్ చెప్పాడు. “భారత జట్టును మైదానంలో చాలా సేపు ఉండేలా చేసి.. ఆఖరికి వారిని మా ముందు సాష్టాంగపడేలా చేయడం కోసమే ఇన్నింగ్స్‌ను ఆలస్యంగా డిక్లేర్డ్ చేశాం. వాళ్లు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాలి. ఫలితం మాకు అనుకూలంగా రావాలి. ఆఖరి రోజు ఆఖరి నిమిషం వరకు వాళ్లు పోరాడుతూనే ఉండాలి. చివరికి వారిపై మాదే పైచేయి అవుతుంది” అని నాలుగో రోజు ఆట తర్వాత షుక్రి కాన్రాడ్ అన్నాడు. ఈ కామెంట్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సహా.. దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం డేల్ స్టెయిన్ విమర్శలు గుప్పించారు. ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు కరెక్ట్ కాదని పేర్కొన్నారు.
అప్పుడు ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దక్షిణాఫ్రికా క్రికెట్‌కు భారత్ చేసిన సాయం గుర్తు చేసుకోవాలంటూ హితవు పలికాడు. విజయం కోసం ఆడటంలో తప్పులేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదని తెలిపాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా కూడా తన కోచ్ వ్యాఖ్యలకు పరోక్షంగా మద్దతు పలకడం భారత అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. విజయం కోసం చివరి వరకూ మోకాళ్లపై నిలిచి ఉండేలా చేసేందుకే ఇన్నింగ్స్‌ను త్వరగా డిక్లేర్డ్ చేయలేదని వ్యాఖ్యానించాడు.
అలా అనలేదు..
దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ ‘గ్రోవెల్’ (సాష్టాంగపడటం) అనే పదం వాడటం టీమ్ఇండియా అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. అయితే, తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని భారత్‌తో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం షుక్రి వివరణ ఇచ్చాడు. ఆ పదాలను ఉపయోగించినందుకు చింతిస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘ఎలాంటి దురుద్దేశంతో ఆ కామెంట్ చేయలేదు. ఎవరిని కించపర్చాలనేది నా లక్ష్యం కాదు. నేను తెలివిగా వ్యవహరించి మంచి పదం ఎంచుకోవాల్సింది. భారత ఆటగాళ్లు ఎక్కువ సమయం ఫీల్డింగ్ కోసం మైదానంలో గడపాలన్నది నా ఉద్దేశ్యం. కానీ, ప్రజలు దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారు. భవిష్యత్‌లో నా భాష విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే ప్రతిదానికీ ఏదొక సందర్భం ముడిపడి ఉంటుంది. నా వ్యాఖ్యలతో వన్డే సిరీస్ ఆసక్తికరంగా మారింది. అంతేకాదు భారత్ సిరీస్‌ను సొంతం చేసుకోవడంతో టీ20 సిరీస్ మరింత ఆసక్తికరంగా మారుతుంది’ అని షుక్రి వివరించాడు. అప్పుడు ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్యలపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. విజయం కోసం ఆడటంలో తప్పులేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదని తెలిపాడు. ఇప్పుడు వన్డే సిరీస్‌ను టీమ్ఇండియా కైవసం చేసుకోవడంతో షుక్రికి భారత్ సరైన గుణపాఠం చెప్పిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. భారత్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే. గువాహటిలో జరిగిన రెండో మ్యాచ్‌లో సఫారీలు భారీ విజయం సాధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

