TEAM INDIA: "తెల్ల"మొహం వేస్తున్న టీమిండియా

TEAM INDIA: తెల్లమొహం వేస్తున్న టీమిండియా
X
చెత్త ప్రదర్శనతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు

భా­ర­త­లో పర్య­ట­న­కు వి­దే­శీ జట్లు వచ్చి­న­ప్పు­డు.. అది ఎంత పె­ద్ద జట్టు అయి­నా వై­ట్‌ వా­ష్‌ చే­య­డం భా­ర­త్‌­కు ఆన­వా­యి­తీ­గా వస్తూ వచ్చిం­ది. దాం­తో సు­న్నా­లు వా­ళ్ల వైపు ఉం­డే­వి. కానీ ఇప్పు­డు సు­న్నా­లు మన­వై­పు వస్తు­న్నా­యి. దా­ని­కి కా­ర­ణం మన జట్టు­కు చాలా వి­భా­గా­ల్లో సు­న్నా మా­ర్కు­లు పడు­తుం­డ­ట­మే. వా­టి­లో స్వీ­ప్‌, ఓపిక, ని­ల­కడ, అవ­గా­హన, వరుస సి­రీ­స్‌­లు లాం­టి ము­ఖ్య­మైన అం­శా­లు­న్నా­యి. స్పి­న్‌ పి­చ్‌­లు, అం­దు­లో­నూ బంతి బాగా టర్న్‌ అయ్యే­ పిచ్ లపై ఉన్న మన దే­శం­లో స్వీ­ప్‌ షా­ట్‌ అనే­ది హి­ట్‌ షా­ట్‌. ఒక­ప్పు­డు భారత బ్యా­ట­ర్లు ఈ షా­ట్‌­ను అద్భు­తం­గా ఆడి పరు­గు­లు సం­పా­దిం­చే­వా­రు. కానీ ఇప్పు­డు ఆ పని­ని వి­దే­శీ బ్యా­ట­ర్లు చే­స్తు­న్నా­రు. మన­వా­ళ్లు ఫీ­ల్డిం­గ్‌­లో ని­ల­బ­డి ఆ షా­ట్లు చూ­స్తు­న్నా­రు. గత న్యూ­జి­లాం­డ్‌ సి­రీ­స్‌, ఇప్ప­టి సౌ­తా­ఫ్రి­కా సి­రీ­స్‌­లో మన బ్యా­ట­ర్లు ఎప్పు­డో ఓసా­రి ఆ షా­ట్‌ ఆడా­రు. కొం­త­మం­ది ప్ర­య­త్నిం­చి­నా కనె­క్ట్‌ చే­య­లేక ఔట­య్యా­రు. దీం­తో మన­వా­ళ్లు స్వీ­ప్‌­షా­ట్లు మరి­చి­పో­యా­రా అనే డౌ­ట్‌ వస్తోం­ది. టె­స్టు­ల్లో ఎంత ఓపి­క­గా బ్యా­టిం­గ్‌ చే­స్తే.. వి­జ­యా­వ­కా­శా­లు అంత ఎక్కు­వ­గా ఉం­టా­య­ని చె­బు­తా­రు. ఎన్నో ఏళ్లు­గా అదే మన బలం­గా ఆడాం. మ్యా­చ్‌­లు గె­లి­చాం. టీ20ల వల్ల­నో, జట్టు­లో కొ­త్త రక్తం వల్ల­నో కానీ మన బ్యా­ట­ర్ల­కు ఓపిక లే­కుం­డా పో­యిం­ది. డ్రె­స్సిం­గ్‌ రూ­మ్‌­లో ఏదో పని ఉంది అన్న­ట్లు­గా వచ్చీ రా­గా­నే భారీ షా­ట్ల­కు వె­ళ్ల­డం, ఔట­వ్వ­డం ఈ మధ్య కని­పి­స్తోం­ది. దూ­కు­డు ప్ర­య­త్నం ఫలి­తం ఇవ్వ­క­పో­యి­నా అదే చే­స్తూ.. చే­జే­తు­లా వి­కె­ట్‌ పో­గొ­ట్టు­కొ­ని మ్యా­చ్‌­లు సమ­ర్పిం­చు­కుం­టు­న్నా­రు. క్రీ­జు నుం­చి ఫ్రం­ట్‌ ఫు­ట్‌ కొ­చ్చిన బ్యా­ట­ర్లూ కని­పిం­చ­డం లేదు.

అంతా చేసింది గంభీరే

గౌ­త­మ్ గం­భీ­ర్, భారత క్రి­కె­ట్ జట్టు మాజీ ప్లే­య­ర్, ఐపీ­ఎ­ల్ 2024లో కో­ల్‌­క­తా నైట్ రై­డ­ర్స్ జట్టు­ను వి­జే­త­గా ని­లి­పిన తరు­వాత, భారత క్రి­కె­ట్ జట్టు హెడ్ కో­చ్‌­గా ని­య­మి­తు­డ­య్యా­డు. 2024 టీ20 ప్ర­పం­చ­క­ప్ టై­టి­ల్ సా­ధిం­చిన తర్వాత, రా­హు­ల్ ద్రా­వి­డ్ హెడ్ కోచ్ పద­వి­ని గం­భీ­ర్‌­కు అప్ప­గిం­చా­రు. అతని కో­చిం­గ్‌­లో భా­ర­త్ మె­రు­గైన ఫలి­తా­లు సా­ధిం­చ­గ­ల­ద­ని అం­ద­రూ భా­విం­చా­రు. కానీ, ఆరు నె­ల­లు గడి­చాక, పరి­స్థి­తి అం­త­గా సా­ను­కూ­లం­గా మా­ర­లే­దు. గతం­తో పో­ల్చి­తే, భా­ర­త్ ప్ర­ద­ర్శన మరింత పత­న­మ­య్యిం­ది. గతే­డా­ది ఇదే సమ­యా­ని­కి సొం­త­గ­డ్డ­పై న్యూ­జి­లాం­డ్ చే­తి­లో వరు­స­గా మూడు టె­స్ట్ మ్యా­చ్‌­ల్లో ఓట­మి­పా­లైం­ది. 93 ఏళ్ల భారత క్రి­కె­ట్ చరి­త్ర­లో­నే తొ­లి­సా­రి సొం­గ­డ్డ­పై క్లీ­న్ స్వీ­ప్ అయ్యిం­ది. ఆ తర్వాత ఆస్ట్రే­లి­యా గడ్డ­పై బో­ర్డ­ర్ గవా­స్క­ర్ ట్రో­ఫీ­ని కో­ల్పో­యిం­ది. ఈ పరా­జ­యా­ల­తో డబ్ల్యూ­టీ­సీ 2025 ఫై­న­ల్ బె­ర్త్‌­ను చే­జా­ర్చు­కుం­ది.

బొమ్మ కెప్టెన్

జట్టు­లో తాను ఆడిం­చి­న­ట్లు­గా ఆడే కె­ప్టె­న్‌­ను పె­ట్టు­కొ­ని ప్ర­తీ వి­ష­యం­లో జో­క్యం చే­సు­కుం­టూ గం­భీ­ర్ జట్టు­ను నా­శ­నం చే­స్తు­న్నా­డ­ని ఫ్యా­న్స్ ఆరో­పి­స్తు­న్నా­రు. ప్ర­తీ వి­ష­యం­లో జో­క్యం చే­సు­కుం­టే ఫలి­తా­లు ఇలా­నే ఉం­టా­య­ని మం­డి­ప­డు­తు­న్నా­రు. వీ­లై­నంత త్వ­ర­గా గం­భీ­ర్‌­ను హెడ్ కోచ్ బా­ధ్య­తల నుం­చి తప్పిం­చా­ల­ని డి­మాం­డ్ చే­స్తు­న్నా­రు. భారత క్రి­కె­ట్‌­కు గం­భీ­ర్ మరో గ్రే­గ్ ఛా­పె­ల్‌­లా తయా­ర­య్యా­డ­ని వి­మ­ర్శ­లు గు­ప్పి­స్తు­న్నా­రు. గంభీర్ కోచ్ గా ఉండగానే 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. స్వదేశంలో టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరుకి ఆలౌట్ అయింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 36 ఏళ్ల తర్వాత కోల్పోయింది.

Tags

Next Story