TEAM INDIA: రో-కో, గంభీర్‌ల మధ్య దూరం..

TEAM INDIA: రో-కో, గంభీర్‌ల మధ్య దూరం..
X
రోహిత్-కోహ్లీ, గంభీర్ మధ్య పెరుగుతున్న అంతరం

టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‌కు సీనియర్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ మధ్య అంతరం పెరుగుతోంది. వీళ్లిద్దరు టెస్టులకు దూరం అవడానికి కారణం గంభీరే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పడు వన్డే జట్టులో సీనీయర్లు ఇద్దరూ ఉన్నా.. కోచ్ కు మాత్రం దూరంగానే ఉంటున్నారు. రో-కో 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో వీరికి, కోచ్‌కు మధ్య నెలకొన్న అంతరం తగ్గాల్సిందే. దీని కోసం బీసీసీఐ నేడు సమావేశం నిర్వహిస్తోంది.

దక్షి­ణా­ఫ్రి­కా­తో రెం­డో వన్డే డి­సెం­బ­ర్ 3న రా­య్‌­పు­ర్‌­లో జరు­గ­నుం­ది. అయి­తే, ఈ మ్యా­చ్‌­కు ముం­దు టీ­మిం­డి­యా హెచ్ కోచ్ గౌ­త­మ్ గం­భీ­ర్, చీఫ్ సె­లె­క్ట­ర్ అజి­త్ అగా­ర్క­ర్‌­తో బీ­సీ­సీఐ ఆక­స్మిక సమా­వే­శం ని­ర్వ­హిం­చే అవ­కా­శ­ముం­ద­ని సమా­చా­రం. టె­స్టు జట్టు ప్ర­స్తుత ఫా­మ్‌, వ్యూ­హా­ల­పై కీలక చర్చ­లు జరి­గే అవ­కా­శం ఉం­ద­ని క్రి­కె­ట్ వర్గా­లు చె­బు­తు­న్నా­యి. 8 నెలల తర్వాత టె­స్ట్ సి­రీ­స్ ఉం­ద­ని, అప్ప­టి­కి స్ప­ష్ట­మైన ప్లా­న్‌­లో ఉం­డా­ల­ని బీ­సీ­సీఐ భా­వి­స్తోం­దట. టె­స్టు క్రి­కె­ట్‌­లో ఇటీ­వల అను­స­రి­స్తు­న్న వ్యూ­హా­లు, జట్టు ప్ర­ద­ర్శ­న­పై బీ­సీ­సీఐ ఆం­దో­ళన వ్య­క్తం చే­స్తోం­ది. రా­బో­యే 8 నె­ల­ల్లో తదు­ప­రి టె­స్టు సి­రీ­స్ ఉన్న నే­ప­థ్యం­లో, ఇప్ప­టి నుం­చే స్ప­ష్ట­మైన ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చా­ల­ని బో­ర్డు భా­వి­స్తోం­ది.

లోపాలపైనే దృష్టి

సీ­ని­య­ర్ ఆట­గా­ళ్ల­తో మే­నే­జ్‌­మెం­ట్ వ్య­వ­హ­రి­స్తు­న్న తీ­రు­పై ప్ర­శ్న­లు తలె­త్తు­తు­న్నా­యి. టీ20లకు రి­టై­ర్మెం­ట్ ప్ర­క­టిం­చి, టె­స్టుల నుం­చి పక్క­కు తప్పు­కు­న్న వీ­రి­తో కమ్యూ­ని­కే­ష­న్ గ్యా­ప్ ఉం­ద­ని వా­ర్త­లు వస్తు­న్నా­యి. దీ­ని­పై స్ప­ష్టత తీ­సు­కో­వ­డా­ని­కి ఈ సమా­వే­శం కీ­ల­కం కా­నుం­ది. వచ్చే ఏడా­ది టీ20 ప్ర­పంచ కప్ టై­టి­ల్ ని­ల­బె­ట్టు­కో­వ­డం, ఆ తర్వాత వచ్చే వన్డే ప్ర­పంచ కప్ కోసం జట్టు­ను సి­ద్ధం చే­య­డం­పై బో­ర్డు దృ­ష్టి పె­ట్టిం­ది. మొ­త్తా­ని­కి, రా­య్‌­పూ­ర్‌­లో జర­గ­బో­యే ఈ సమా­వే­శం భారత క్రి­కె­ట్ జట్టు భవి­ష్య­త్ ది­శా­ని­ర్దే­శం చే­య­డా­ని­కి, లో­పా­లు సరి­ది­ద్ద­డా­ని­కి ఒక “స్ట్ర­క్చ­ర­ల్ అలై­న్‌­మెం­ట్”గా భా­వి­స్తు­న్నా­రు.

Tags

Next Story