TEAM INDIA: 2026 టీమిండియా షెడ్యూల్ ఇదే!

భారత పురుషుల క్రికెట్ జట్టుకు 2026 సంవత్సరం చాలా బిజీగా, సవాలుగా మారనుంది. ఒకవైపు సొంతగడ్డపై టీ20 ప్రపంచ కప్‌ను నిర్వహించడం, అసలే డిఫెండింగ్ ఛాంపియన్స్ కావడంతో టైటిల్‌ను నిలబెట్టుకోవాలన్న ఒత్తిడి జట్టు మీద ఉంటుంది. మరోవైపు టెస్ట్ క్రికెట్‌లో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందాల్సిన అవసరం ఉంటుంది. 2025లో దక్షిణాఫ్రికాతో జరిగిన సొంత టెస్టుల్లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. ఇప్పుడు అందరి దృష్టి 2026లో మొదలయ్యే న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్ తో పాటు టీ20 వరల్డ్ కప్ పైనే ఉంది.
భారత క్రికెట్ క్యాలెండర్ 2026 (పూర్తి షెడ్యూల్)
జనవరి 2026: భారత పర్యటనకు న్యూజిలాండ్
వన్డే సిరీస్
11 జనవరి 2026: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ - మొదటి వన్డే, వడోదర
14 జనవరి 2026: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ - రెండో వన్డే, రాజ్‌కోట్
18 జనవరి 2026: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ - మూడో వన్డే, ఇండోర్
టీ20 సిరీస్
21 జనవరి 2026: మొదటి టీ20, నాగ్‌పూర్
23 జనవరి 2026: రెండో టీ20, రాయ్‌పూర్
25 జనవరి 2026: మూడో టీ20, గౌహతి
28 జనవరి 2026: నాలుగో టీ20, విశాఖపట్నం
31 జనవరి 2026: ఐదో టీ20, తిరువనంతపురం
ఫిబ్రవరి- మార్చి 2026: టీ20 ప్రపంచ కప్ (భారత్, శ్రీలంకలో)
గ్రూప్ మ్యాచ్‌లు
7 ఫిబ్రవరి 2026: భారత్ వర్సెస్ USA - ముంబై
12 ఫిబ్రవరి 2026: భారత్ వర్సెస్ నమీబియా - ఢిల్లీ
15 ఫిబ్రవరి 2026: భారత్ వర్సెస్ పాకిస్థాన్ - కొలంబో
18 ఫిబ్రవరి 2026: భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ - అహ్మదాబాద్
నాకౌట్ (క్వాలిఫై అయితే)
21 ఫిబ్రవరి 2026 - 1 మార్చి: సూపర్-8 మ్యాచ్‌లు
5 మార్చి 2026: సెమీఫైనల్ - ముంబై
8 మార్చి 2026: ఫైనల్ - అహ్మదాబాద్
మార్చి-మే 2026: ఐపీఎల్ 2026
26 మార్చి నుండి 31 మే వరకు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026 నిర్వహణ)
జూన్ 2026: ఆఫ్ఘనిస్తాన్ భారత పర్యటన
3 వన్డే మ్యాచ్‌లు
1 టెస్ట్ మ్యాచ్
తేదీలు, వేదికలు తర్వాత ప్రకటిస్తారు)
జూలై 2026: భారత్ ఇంగ్లాండ్ పర్యటన
టీ20 సిరీస్
1 జూలై 2026: మొదటి టీ20 - చెస్టర్-లే-స్ట్రీట్
4 జూలై 2026: రెండో టీ20 - మాంచెస్టర్
7 జూలై 2026: మూడో టీ20 - నాటింగ్‌హామ్
9 జూలై 2026: నాలుగో టీ20 - బ్రిస్టల్
11 జూలై 2026: ఐదో టీ20 - సౌతాంప్టన్
వన్డే సిరీస్
14 జూలై: మొదటి వన్డే - బర్మింగ్‌హామ్
16 జూలై: రెండో వన్డే - కార్డిఫ్
19 జూలై: మూడో వన్డే - లార్డ్స్, లండన్
ఆగస్టు 2026
ఆగస్టు: భారత్ శ్రీలంక పర్యటన - 2 టెస్టులు
సెప్టెంబర్ 2026
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ భారత్ - 3 టీ20 మ్యాచ్‌లు
ఆసియా క్రీడలు (జపాన్)
వెస్టిండీస్ భారత పర్యటన - 3 వన్డే మ్యాచ్‌లు, 5 టీ20 మ్యాచ్‌లు
అక్టోబర్-నవంబర్ 2026
భారత్ న్యూజిలాండ్ పర్యటన - 2 టెస్ట్ మ్యాచ్‌లు, 3 వన్డే మ్యాచ్‌లు
డిసెంబర్ 2026
శ్రీలంక భారత పర్యటన - 3 వన్డే మ్యాచ్‌లు, 3 టీ20 మ్యాచ్‌లు
భారత క్రికెట్ జట్టుకు 2026 ఏడాది చాలా బిజీగా, ముఖ్యమైన సంవత్సరంగా ఉండనుంది. ఒకవైపు రోహిత్, కోహ్లీ లేకుండా బరిలోకి దిగుతుంది కనుక యువ ఆటగాళ్లపై టీ20 ప్రపంచ కప్ ఒత్తిడి ఉంటుంది. మరోవైపు టెస్టుల్లో రోకోలు లేకున్నా రాణించేలా జట్టు ఎదగాల్సిన అవసరం ఉంది. వన్డే క్రికెట్‌లో కూడా తమను తాము నిరూపించుకోవాల్సిన సవాలు ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

