Telangana Sports Hub : స్పోర్ట్స్ హబ్‌గా తెలంగాణ.. సీఎం కప్ ప్రారంభం

రానున్న రోజుల్లో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ గా మారుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి థీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం త్వరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీని నెలకొల్పుతున్నామని, దాని ఆధ్వర్యం లోనే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి దక్షిణ కొరియా నుంచి కోచ్లను తెప్పించి శిక్షణ అందిస్తామన్నారు.
సీఎం కప్ - 2020 పోటీలను ఎల్బీ స్టేడియంలో గురువారం ప్రారంభించి మస్కట్ లోగో, పోస్టర్లను ఎష్కరించిన సందర్భంగా క్రీడాభివృద్ధి, లక్ష్యాలను వివరించారు. భవిష్యత్తులు హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి క్రీడా వేదికగా మారబోతున్నదన్నారు. పాతికేండ్ల క్రితమే హైదరాబాద్ నగరం ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ కు వేదికగా నిలిచిందని, క్రీడా రంగానికి తలమానికంగా నిలబడిందని సీఎం గుర్తు చేశారు. దురదృష్టవశాత్తూ గడచిన పదేండ్లలో క్రీడా రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, క్రీడలవైపు వెళ్ళాల్సిన యువత మత్తు పదార్ధాలు, వ్యసనాలకు బానిసలయ్యే పరిస్థితి తలెత్తిందని అందోళన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com