Ruturaj : మా ఓటమికి అదే కారణం: రుతురాజ్

ఆర్సీబీతో మ్యాచులో తాము ఓడిపోవడానికి ఫీల్డింగ్ సరిగా చేయకపోవడమే కారణమని చెన్నై కెప్టెన్ రుతురాజ్ అన్నారు. ‘ఈ పిచ్‌పై 170 మంచి స్కోర్. ఆర్సీబీ 20 రన్స్ అదనంగా చేసింది. మా ఫీల్డర్లు కీలక సమయాల్లో క్యాచులు వదిలేశారు. పెద్ద టార్గెట్ ఛేజ్ చేస్తున్నప్పుడు కొంచెం భిన్నంగా బ్యాటింగ్ చేయాలి. ఆ ప్రయత్నంలోనే వికెట్లు కోల్పోయాం. కేవలం 50 రన్స్ తేడాతో ఓడాం. భారీ తేడాతో ఓడనందుకు సంతోషం’ అని పేర్కొన్నారు.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై పై ఆర్సీబీ దాదాపు 17 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. ఈ గ్రౌండ్‌లో చివరిసారిగా 2008లో చెన్నైను ఓడించిన బెంగళూరు.. మళ్లీ 6,155 రోజుల తర్వాత ఇప్పుడు గెలుపును నమోదు చేసింది. అందుకే ఈ విజయం ఆర్సీబీ చాలా స్పెషల్. ఈ సీజన్‌లో పాటీదార్ సేనకు ఇది రెండో విజయం. 4 పాయింట్లతో ఆ జట్టు ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉంది. ఈ ఫామ్‌ను ఇలాగే కొనసాగించి ఛాంపియన్‌గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. 33 ఇన్నింగ్స్‌లలో 1,084 రన్స్ చేసిన ఆయన, శిఖర్ ధవన్‌ను (1,057) అధిగమించారు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (896), దినేశ్ కార్తీక్(727), డేవిడ్ వార్నర్ (696) ఉన్నారు. నిన్న చెన్నైతో మ్యాచులో కోహ్లీ 30 బంతుల్లో 31 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com