Champions Trophy : హతవిధీ.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం..!

Champions Trophy : హతవిధీ.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం..!
X

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభించిన 6 రోజుల్లోనే అతిథ్య పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, న్యూజిలాండ్‌పై వరుస ఓటములతో ఆ జట్టు మరో మ్యాచ్ ఉండగానే సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో ఓ ICC టోర్నీ జరుగుతోంది. కానీ ఆ ఆనందాన్ని ఆరు రోజులు కూడా ఆ దేశం నిలుపుకోలేకపోయింది. ఈ నెల 27న బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 5 వికెట్లు కోల్పోయి 46.1 ఓవర్లలోనే ఛేదించింది. రచిన్ రవీంద్ర (112) సెంచరీతో విజృంభించారు. 12 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం చేశారు. ఒక దశలో 72/3తో కష్టాల్లో ఉన్న జట్టును రవీంద్ర ఆదుకున్నారు. కాగా ఈ ఫలితంతో పాక్, బంగ్లా టోర్నీ నుంచి నిష్క్రమించగా, భారత్, కివీస్ సెమీస్‌కు దూసుకెళ్లాయి.

Tags

Next Story