Abhishek Sharma : నా ఎదుగుదలకు వారే కారణం: అభిషేక్ శర్మ

క్రికెటర్‌గా తన ఎదుగుదలకు యువరాజ్ సింగ్, లారా, వెటోరి తోడ్పడ్డారని, ఇప్పుడు గౌతమ్ గంభీర్ అండగా నిలుస్తున్నారని అభిషేక్ శర్మ తెలిపారు. ఇంగ్లండ్‌తో తొలి టీ20 అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విఫలం అవుతాననే భయం లేకుండా సొంత శైలిలో ఆడమని కోచ్, కెప్టెన్ తనకు చెప్పారని పేర్కొన్నారు. అదే తనకు కాన్ఫిడెన్స్ ఇచ్చిందన్నారు. తొలి టీ20లో అభిషేక్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.
2007 టీ20 ప్రపంచ కప్‌లో యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఫీట్ సాధించిన అతని గురువు యువీ తర్వాత అభిషేక్ నిలిచాడు. ప్రస్తుతం ఈ యంగ్ ప్లేయర్‌కు యువరాజ్ మెంటార్‌గా ఉన్నాడు.
ఇక టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో భువనేశ్వర్, బుమ్రాను హార్దిక్ పాండ్య దాటేశారు. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన తొలి టీ20లో 2 వికెట్లు తీసిన హార్దిక్ తన ఖాతాలో 91 వికెట్లు వేసుకున్నారు. ఈ జాబితాలో భువనేశ్వర్‌కు 90, బుమ్రాకు 89 వికెట్లు ఉన్నాయి. అటు ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన లిస్టులో చాహల్‌ను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ సింగ్ 97 వికెట్లతో అగ్రస్థానానికి చేరుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com