Tokyo Olympics: భారత్‌కు మరో పతకం ఖాయం..

Lovlina Borgohain
X

Lovlina Borgohain File Photo

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది

Lovlina Borgohain: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ పోరులో తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లో బెర్త్‌ ఖరారు చేసుకుంది. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న ఈ అస్సాం అమ్మాయి.. సెమీస్‌లో గెలిస్తే ఫైనల్‌కు వెళ్తుంది. ఒకవేళ ఓడిపోయినా.. కనీసం కాంస్య పతకం దక్కుతుంది.

తొలి రౌండ్ నుంచి కూడా ఎక్కడా తడబడకుండా లవ్లీనా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే మూడో రౌండ్‌లో తైపీ బాక్సర్ ఎదురుదాడికి దిగినప్పటికీ.. లవ్లీనా తన ఆధిక్యతను నిలుపుకుంటూ వచ్చి విజయం సాధించింది. చెన్‌ చేతిలో గతంలో లవ్లీనా మూడు సార్లు ఓటమి చెందింది. తాజా మ్యాచ్‌ విజయంతో లవ్లీనా పాత లెక్కలన్నిటినీ సరిచేసింది.

ఇక బాక్సింగ్ లాంటి ఈవెంట్లో సెమీఫైనల్ కి చేరితే మెడల్ ఖాయంగా చెప్పుకోవచ్చు. బాక్సింగ్‌లో రెండు కాంస్య పతకాలను ఇస్తారు. రెండు సెమీఫైనల్స్ లో తలపడ్డ నలుగురు బాక్సర్లలో ఇద్దరు ఫైనల్స్ కి అర్హత సాధించి గోల్డ్, సిల్వర్ మెడల్స్ ని దక్కించుకుంటారు. ఇక సెమిస్ లో ఓటమి చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కాంస్యపతకాలను అందిస్తారు. అందుకే బాక్సింగ్ లో సెమిస్ చేరితే పతకం గ్యారంటీ

Tags

Next Story