చరిత్ర సృష్టించిన ఇండియా ఉమెన్స్ హాకీ..మిగతా ఈవెంట్లలో భారత్‌కు నిరాశే

చరిత్ర సృష్టించిన ఇండియా ఉమెన్స్ హాకీ..మిగతా ఈవెంట్లలో భారత్‌కు నిరాశే
Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి సెమీఫైనల్‌ చేరిన జట్టుగా రికార్డు నెలకొల్పారు.

ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి సెమీఫైనల్‌ చేరిన జట్టుగా రికార్డు నెలకొల్పారు. క్వార్టర్స్ లో వరల్డ్ నెంబర్ 2 ఆస్ట్రేలియాను ఇండియా హాకీ టీమ్ చిత్తుగా ఓడించింది. సోమవారం జరిగిన పోరులో ఆస్ట్రేలియాను 1-0తో మట్టికరిపించి తొలిసారి సెమీఫైనల్‌కు చేరారు. బుధవారం జరిగే సెమీస్‌లో అర్జెంటీనాతో భారత్‌ మహిళల టీమ్ తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. డిఫెన్స్‌కు మారుపేరైన ఆసీస్‌పై భారత మహిళలకు ఒకే ఒక్క పెనాల్టీ కార్నర్‌ లభించింది. భారత గోల్‌కీపర్‌ సవిత 7 పెనాల్టీ కార్నర్లు, 2 ఫీల్డ్‌ గోల్స్‌ను అడ్డుకున్న ఆమె టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆసీస్‌ చేసిన 9 అటాక్స్ ను నిలువరించింది.

భారత్ ఆటలో 22వ నిమిషం దొరికిన ఈ సువర్ణ అవకాశాన్ని గుర్జీత్‌ కౌర్‌ అందిపుచ్చుకొని గోల్‌గా మలిచింది. దాంతో భారత్ 1-0తో లీడ్‌లోకి వెళ్లింది. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి సెమీఫైనల్‌ చేరి చరిత్ర సృష్టించారు. కానీ మిగతా ఈవెంట్లలో మాత్రం భారత్‌కు నిరాశే ఎదురైంది. ఈక్వెస్ట్రెయన్ ప్లేయర్ ఫవాద్ మీర్జా ఫైనల్లో తడబడి తీవ్రంగా నిరాశపరిచారు. షూటర్స్ సంజీవ్, ప్రతాప్ సింగ్ సైతం చేతులెత్తేసారు. ఫలితంగా భారత్ పతకం లేకుండానే 10వ రోజును ముగించింది.

Tags

Read MoreRead Less
Next Story