Travis Head : ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 రన్స్

Travis Head : ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 రన్స్
X

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరోసారి తన బ్యాటింగ్ విధ్వంసం సృస్టించాడు.భారీ షాట్స్ తో ప్రత్యర్థి బౌలర్ పై విరుచుకుపడ్డాడు.సౌతాంప్టన్‌లో బుధవారం అస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరిగింది. ఇందులో ఆసీస్, ఆతిథ్య ఇంగ్లాండ్‌ను 28 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. జేమీ ఓవర్టన్, జాకబ్ బెథాన్ మరియు జోర్డాన్ కాక్స్ ఇంగ్లండ్ తరపున తమ టి20 అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు పవర్‌ ప్లేలో 86 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్ జట్టుకు శుభారంభం అందించారు. కంగారూ జట్టు 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ తుఫాను వేగంతో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ (59) సాధించాడు. ఈ నేపథ్యంలో సామ్ కరన్ వేసిన ఒక ఓవర్లో 30 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేయడానికి వచ్చిన కరన్ బౌలింగ్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆ ఓవర్‌లో వరుసగా 3 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టి 30 పరుగులు చేశాడు. అనంతరం చేదంకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు 19.2 ఓవర్లలో కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. తద్వారా తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా ట్రావిస్ హెడ్ నిలిచాడు.

Tags

Next Story