నా క్రికెట్ కెరీర్‌కు ఇద్దరు దిగ్గజాలే స్ఫూర్తి.. శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

నా క్రికెట్ కెరీర్‌కు ఇద్దరు దిగ్గజాలే స్ఫూర్తి.. శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తన క్రికెట్ కెరీర్‌కు ఇద్దరు దిగ్గజాలే మార్గదర్శకులని వెల్లడించారు. టెస్ట్ జట్టు కెప్టెన్‌గా, వన్డేలు, టీ20లకు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్, ఆ ఇద్దరు దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ అని తెలిపారు. ప్రస్తుతం ఆసియా కప్ కోసం దుబాయ్‌లో ఉన్న గిల్, ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘టాలెంట్, నైపుణ్యం ఉంటే సరిపోదు. ఆడాలనే తపన, అభిరుచి లేకపోతే విజయం సాధించడం చాలా కష్టం. ఈ విషయంలో విరాట్ కోహ్లీ నిబద్ధతే నాకు స్ఫూర్తి. ప్రశంసల గురించి పట్టించుకోకుండా నా బాధ్యతలు నెరవేర్చేందుకే నేను ప్రయత్నిస్తాను," అని గిల్ చెప్పారు.

సచిన్, కోహ్లీల గురించి గిల్ వ్యాఖ్యలు శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. "క్రికెట్‌లో నాకు ఇద్దరు మార్గదర్శకులు ఉన్నారు. మా నాన్నకు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం. నేను క్రికెట్‌లోకి రావడానికి ఆయనే కారణం. సచిన్ 2013లో రిటైర్ అయ్యే సమయానికే, నేను క్రికెట్ ఆడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకున్నాను. కేవలం నైపుణ్యం మాత్రమే కాకుండా, ఆట గురించి మానసికంగా, వ్యూహాత్మకంగా ఎలా ఆలోచించాలో మొదలుపెట్టాను. విరాట్ కోహ్లీతో కలిసి నేను ఆడే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి నేను విరాట్‌ను చాలా దగ్గరగా గమనించాను. ఆట పట్ల ఆయనకున్న నిబద్ధత నిజంగా అద్భుతం," అని గిల్ ప్రశంసించారు.

Tags

Next Story