Vaibhav Suryavamshi: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్.. టీమ్ ఇండియాలోకి అరంగేట్రం..

క్రికెట్ చరిత్రలో మరో యువ కెరటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.. క్రికెట్ దిగ్గజాలు సైతం అతడి ఆట తీరును ప్రశసింస్తున్నారు. టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న 15ఏళ్ల ఆ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ.
ప్రస్తుతం భారత క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ , తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకోబోతున్నాడు. పలువురు ఇతర యువ ఆటగాళ్లతో పాటు, ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేసే అభ్యర్థుల జాబితాలో సూర్యవంశీకి కూడా చోటు దక్కినట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, జట్టులోని ప్రత్యామ్నాయ ఆటగాళ్ల బలాన్ని పరీక్షించాలని ఆసక్తిగా ఉన్నందున, ఈ జట్టులో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లే ఉంటారని విస్తృతంగా భావిస్తున్నారు.
"అతను ఐర్లాండ్ పర్యటనకు ఎంపికయ్యేందుకు పోటీలో ఉన్నాడు. సెలెక్టర్లు అతని పేరుతో పాటు అనేక ఇతర ఆటగాళ్ల పేర్లను కూడా షార్ట్‌లిస్ట్ చేశారు" అని భారత క్రికెట్ బోర్డులోని ఒక వర్గం జాతీయ మీడియాకు తెలిపింది.
పత్రిక కథనం ప్రకారం, వైభవ్ ఐర్లాండ్‌లో జరగబోయే సిరీస్‌తో పాటు ఈ ఏడాది చివర్లో జింబాబ్వే పర్యటనకు కూడా ఎంపిక కానున్నాడు. యువ క్రికెట్ క్రీడాకురులలో ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2026 సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 26 బంతుల్లో 78 పరుగులు, చెన్నై సూపర్ కింగ్స్‌పై 17 బంతుల్లో 52 పరుగులు, ముంబై ఇండియన్స్‌పై 14 బంతుల్లో 39 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దీంతో మాజీ క్రికెటర్లు, నిపుణులు అతడిని సీనియర్ జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని సిఫార్సు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
