BCCI Special Video : ఒక్కటైన గంభీర్, విరాట్.. బీసీసీఐ స్పెషల్ వీడియో

BCCI Special Video : ఒక్కటైన గంభీర్, విరాట్.. బీసీసీఐ స్పెషల్ వీడియో
X

ఐపీఎల్లో తమ మధ్య మొదలైన వివాదానికి తెరదించారు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్. ఈ ఇద్దరూ ఓ ఇంటర్వ్యూలో జాలీగా నవ్వుతూ కనిపించారు. ఆ వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పెట్టింది. బంగ్లాదేశ్ తొలి టెస్టుకు ముందు సాగిన ఈ ఇంటర్వ్యూలో గంభీర్.. కోహ్లితో ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.

బీసీసీఐ పోస్ట్ చేసిన ఇంటర్వ్యూ వీడియోలో కోహ్లి, గంభీర్ లు నవ్వుతూ పలకరించుకున్నారు. ఇక్కడితో మసాలాకు ముగింపు పలుకుతున్నాం అని విరాట్ అనగానే.. గౌతీ కూడా ఓకే అన్నట్టు తలూపాడు. ఈ వీడియోలో కోహ్లి, గంభీర్ లు భారత జట్టు విజయాల్లో భాగమైన తీరును చూపించారు. మైదానంలో కోహ్లి, గంభీర్లు ఎంత దూకుడుగా ఉంటారో తెలిసిందే. ప్రత్యర్థి జట్టు వీళ్లను పొరపాటున కవ్వించిందంటే.. ఇక అంతే. అలాంటిది ఈ ఇద్దరు ఐపీఎల్ మ్యాచ్ ల సమయంలో నువ్వానేనా అన్నట్టు మాటల యుద్ధానికి దిగారు.

ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి శివనామ స్మరణ చేశాడని.. తానేమో హనుమాన్ చాలీసా వింటూ గడిపానని గౌతీ చెప్పాడు. 'టీమిండియా 2014–16లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన జట్టులో కోహ్లి, నేను ఉన్నాం. అప్పుడు కోహ్లి ప్రతి బంతిని ఎదుర్కొనేముందు ఓం నమః శివాయ అని అనేవాడు. అలా అతడు ఏకాగ్రతగా బ్యాటింగ్ చేశాడు. నా విషయానికొస్తే.. నేపియర్ టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాను. స్టంప్స్ పడగానే డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చాక 'హనుమాన్ చాలీసా' వింటూ గడిపాను. అందుకనే రెండున్నర రోజులు బ్యాటింగ్ చేయగలిగాను' అని గంభీర్ వెల్లడించాడు.

Tags

Next Story